అవును ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉండే బేసన్ అంటే.. శనగపిండితో మీ అందానికి మరింత మెరుగులు తెలస్తుందని మీకు తెలుసా..? శనగపిండి చర్మానికి మంచి గ్లోని అందిస్తుంది. చర్మానికి టైట్ నెస్ ను అందిస్తుంది. బేసన్‌తో మొహం కడుక్కోవడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. ఇందుకోసం ఏం చేయాలంటే.
వయసు పెరిగే కొద్దీ మొహంపై ముడతలు, కొంచెం నలుపు రంగు వచ్చేస్తుంటాయి. అయితే దీనికి మంచి పరిష్కారం మీ కిచెన్‌లోనే దొరుకుతుందనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉండే బేసన్ అంటే.. శనగపిండితో మీ అందానికి మరింత మెరుగులు తెలస్తుందని మీకు తెలుసా..? శనగపిండి చర్మానికి మంచి గ్లోని అందిస్తుంది. చర్మానికి టైట్ నెస్ ను అందిస్తుంది. బేసన్‌తో మొహం కడుక్కోవడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. ఇందుకోసం ఏం చేయాలంటే..
ఒక స్పూన్ బేసన్‌లో అర టీస్పూన్ గంధం లేదా పసుపు, కొద్దిగా పాలు తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చక్కటి ఫేస్ ప్యాక్‌లా మారుతుంది. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. వారం లో మూడు సార్లు ఇలా వాడితే మంచి రిజల్ట్ ఖాయంగా కనిపిస్తుంది.
శనగపిండితో చేసి వాడే ఫేస్‌ప్యాక్ చర్మాన్ని బిగువుగా ఉంచుతుంది. ముఖంపై ముడతలను తగ్గిస్తుంది. క్రమంగా వయసు తగ్గినట్లుగా చూపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ సహజమైన ఇంట్లోని పదార్థాలతో చేయటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అందరూ వాడొచ్చు. ఈ ప్యాక్‌ను వారం లో 3 సార్లు వాడండి. మూడో వారానికి మీరు మీ చర్మంలో తేడా గమనించగలుగుతారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
































