యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ ..తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేసింది.
క్షణం, రంగస్థలం, కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది
రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమాన గణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.
ఈ హ్యాట్ బ్యూటీ 39 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. చీర కట్టిన ,స్కర్ట్ వేసిన, బికినితో దర్శనం ఇచ్చిన అది అనసూయకే చెల్లింది. అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తుంది అనసూయ. ఇదిలా ఉంటే అనసూయ తాజాగా తాను మోసపోయిన విషయాన్ని బయటపెట్టారు. @truffle-india అనే ఆన్లైన్ క్లాతింగ్ స్టోర్‌పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.
“కొన్ని రోజుల క్రితం నేను @truffle-indiaలో పలు దుస్తులు ఆర్డర్ చేశాను. అయితే, వారు ఆ దుస్తులను డెలివరీ చేయకుండా నా డబ్బును దోచుకున్నారు. అంతేకాకుండా, డబ్బును రీఫండ్ చేయకుండా నా మెసేజ్‌లకు, కాల్స్‌కు స్పందించడం మానేశారు. సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి, అమాయక ప్రజల నుంచి డబ్బులు కొట్టేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను ఈ పోస్ట్ పెడుతున్నాను” అని అనసూయ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. క్లాతింగ్ వెబ్సైట్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. “అయ్యో పాపం,” “జాగ్రత్తగా ఉండాలి,” “ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి” అంటూ కామెంట్లు పెడుతూ, అనసూయకు మద్దతు తెలుపుతున్నారు.
































