అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం(Accident) జరిగింది. రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ(Lorry) బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.
మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారందరిని ఆస్పత్రికి తరలించారు. మామిడికాయల లోడ్‌తో రైల్వేకోడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తించారు.
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. బోల్తా పడిన లారీని క్రేన్ సాయంతో పక్కకు తీశారు. రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
































