ఏపీ(Ap)లో ఈ మధ్యన తల్లికి వందనం(Thalliki Vandhanam) పథకం అమలు చేసింది. రూ. 13 వేల విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ అయ్యాయి. అయితే శ్రీకాకుళం జిల్లా(Srikakulam) గార మండలం కళింగపట్నం(Kalingapatnam)లో ఓ మహిళ..
రెండో తరగతి చదువుతున్న తన కుమారుడి డబ్బులను తిరిగి పాఠశాల అభివృద్ధికి ఇచ్చేశారు. తన కుమారుడికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, దుస్తులు, బూట్లు, మధ్యాహ్న భోజనం పెడుతోందని అవి చాలని, తల్లికి వందనం డబ్బులను ఈ నెల 10న హెడ్ మాస్టర్ కు అందజేశారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తల్లీ నీకు వందనం అంటూ తాజాగా ట్వీట్ చేశారు. ” తల్లీ మీకు అభినందనలు. పిల్లల చదువుకు తల్లిదండ్రుల్లా ఆలోచిస్తూ కూటమి ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తోందని, తల్లికి వందనం పథకం కింద తన ఖాతాలో పడిన 13 వేలుకి మరో రెండు వేలు కలిపి 15 వేలు పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని అందించిన తల్లీ నీకు వందనం. విద్యా వ్యవస్థ బలోపేతానికి మేము చేస్తున్న కృషికి మీలాంటి వారి సహకారం తోడు కావడం చాలా సంతోషం”. అని లోకేశ్ పేర్కొన్నారు.
































