ఏపీలో ఆ పార్టీదే హవా..తాజా లెక్కలివే

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో వందలాది రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారికి అందుతున్న భారీ విరాళాలు తరచుగా చర్చనీయాంశమవుతాయి.


2008 నుండి 2024 వరకు పార్టీలకు అందిన విరాళాల వివరాలు దేశ రాజకీయాల్లో నిధుల ప్రవాహం ఎలా ఉందో స్పష్టం చేశాయి.

ఈ విరాళాల జాబితాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రస్థానంలో నిలిచింది. దశాబ్దానికి పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ కాలంలో అక్షరాలా రూ.8,251.75 కోట్లు అందాయి, ఇది ఏ ఇతర పార్టీకి అందనంత భారీ మొత్తం.

మరోవైపు, దేశంలో అత్యంత పురాతన పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెస్ రూ.1,951.68 కోట్లతో చాలా వెనుకబడి ఉంది. ప్రాంతీయ పార్టీలలో, పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రూ.1,705.41 కోట్లతో మూడవ స్థానంలో ఉంది. ఒడిశాలోని బిజూ జనతా దళ్ (బీజేడీ) రూ.1,019 కోట్లు, తమిళనాడులోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) రూ.676.50 కోట్లు పొందాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) రూ.503.94 కోట్లు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రూ.320.68 కోట్లు అందుకున్నాయి. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీకి రూ.383.65 కోట్లు విరాళాలుగా అందాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే అత్యధిక విరాళాలు అందాయి

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.