మానవుడు సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సృష్టిస్తోంది. అన్ని రంగాల్లో తన సత్తా చాటుతొంది. నిజం చెప్పలాంటే దాన్ని సృష్టించిన మానవుడి ప్రాణాలను కూడా కాపాడుతూ రుణం తీర్చుకుంటుంది. మన సమస్యను చెబితే వైద్యులు అవసరం లేకుండానే దానికి పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ఇలానే ఓ వ్యక్తి ఏఐ ChatGPT ఇచ్చిన సలహాలో ఎలాంటి ట్రైనర్ అవసరం లేకుండా ఏకంగా 11 కేజీలు తగ్గాడు. ఈ విషయాన్ని స్వయంగా అతనే సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. 56 ఏళ్ల వయస్సు గల ఒక అమెరికన్ యూట్యూబర్ బరువు తగ్గడంతో పాటు ఫిట్‌గా ఆరోగ్యంగా కావాలనుకున్నాడు. అందుకోసం ChatGPTని ఉపయోగించుకున్నాడు. తాను బరువు తగ్గేందుకు ఒక డైట్‌ను ఇవ్వాలని చాట్‌జీపిటీని అడిగాడు. దీంతో చాట్‌జీపిటి అతనికి ఒక డైట్ ప్లాన్ ఇచ్చింది.
అయితే చాట్‌జీపిటి ఇచ్చిన డైట్‌ను అతనకు క్రమం తప్పకుండా పాటించాడు. రోజూ వ్యాయామం చేయడం, టైమ్‌కు పడుకోవడం, ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవడం.. స్టార్ట్ చేశాడు. దీంతో అతను కేవలం 46 రోజుల్లోనే 11 కేజీల బరువు తగ్గాడు. అంతే కాకుండా ఆకర్షనీయమైన, దృడమైన శరీరఆకృతిని పొందాడు. డైట్ తీసుకునే ముందు ఆ యూట్యూబర్ బరువు 95 కేజీలు ఉండగా.. 46 రోజుల డైట్ తర్వాత అతను 83 కేజీలకు వచ్చాడు. అయితే తన ట్రాన్స్ఫర్ మేషన్ గురించి సదురు యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు.
నెటిజన్లతో పంచుకున్న వీడియో పసిఫిక్ నార్త్‌వెస్ట్‌కు చెందిన ఇద్దరు పిల్లల తండ్రి అయిన 56 ఏళ్ల మిస్టర్ క్రోన్ మాట్లాడుతూ.. మొదట్లో తన శరీర ఆకారాన్ని చూసి తనకే సిగ్గేసేదని.. అందరి మధ్యకు వెళ్లినప్పుడు ఇబ్బంది పడేవాడినని చెప్పుకొచ్చాడు. కానీ చాట్‌జీపిటి ఇచ్చిన సరైన డైట్‌తో తాను పూర్తిగా తన శరీరాన్ని మార్చుకున్నట్టు అతను తెలిపాడు.
గమనిక: ఏఐ సలహాలు ఇన్ని సందర్భాల్లో ఉపయోగకరం కాకపోవచ్చు.. కనుక ఇలాంటి విషయాల్లో ఆరోగ్య నిపుణుల సలహాలు కూడా తీసుకోండి.






























