ఇంటిని శుభ్రం చేసేటప్పుడు అసలు పొరపాట్లు చేయకూడదు. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చాలా మంది కొన్ని రకాల పొరపాటులని చేస్తూ ఉంటారు ఇల్లు శుభ్రంగా ఉంది కదా అని భావిస్తారు. కానీ ఎక్కువమంది ఈ పొరపాట్లని చేస్తారు. మరి అవేంటనేది ఇప్పుడే తెలుసుకుందాం.. చాలామంది ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటి ఫ్లోర్ ని తుడుస్తున్నాం కదా అనుకుంటారు కానీ గోడల్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి గోడలకి కూడా చాలా దుమ్ము ఉంటుంది. గోడల్ని కూడా కచ్చితంగా క్లీన్ చేస్తూ ఉండాలి.
గోడలని కనీసం వారానికి ఒక్క సారైనా కూడా క్లీన్ చేసుకోవాలి వాటికీ దుమ్ము ధూళి పేరుకుపోయి ఉంటుంది కిచెన్లో అయితే జిడ్డు కూడా ఉంటుంది. బ్యాక్టీరియా వంటివి చేరతాయి కాబట్టి కచ్చితంగా గోడల్ని క్లీన్ చేయాలి అదే విధంగా కిటికీలను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి కిటికీ కి కూడా చాలా దుమ్ము ఉంటుంది నెలకి ఒకసారి కిటికీలని శుభ్రం చేసుకోండి. అలానే బెడ్ పై పరిచిన దుప్పట్లు వంటివి వాష్ చేస్తూ ఉంటారు.
































