నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గుడ్ న్యూస్ చెప్పింది. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇవాళ(సోమవారం) ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.


ఈ శాఖలో జనరల్, లిమిటెడ్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి 691 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 16 నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 5వ తేదీ ఆఖరు అని స్పష్టం చేసింది. మరిన్ని వివరాల కోసం https://PSC.ap.gov.inలో సైట్ ను చూడాలని ఏపీపీఎస్సీ తెలిపింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.