మంచు విష్ణు తన కెరీర్ ను పణంగా పెట్టి భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.
వసూల్లు కూడా మంచు విష్ణు గత చిత్రాలను పోలిస్తే భారీగానే వచ్చాయి. కానీ మంచు విష్ణు తన మార్కెట్ ను మించి ఖర్చు చేయడంతో ఈ సినిమా ఫైనల్ గా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. కానీ మంచు విష్ణు కెరీర్ లోనే అత్యధిక వసూల్లు దక్కాయి. ఈ వసూళ్లు రావడంలో ప్రభాస్ రోల్ బాగానే కలిసొచ్చింది. కానీ అనుకున్నంత రేంజ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకోకపోవడంతో ఈ చిత్రానికి విష్ణు ఆశించిన వసూళ్లు దక్కలేదు. ఇక మలయాళం నుంచి మోహన్ లాల్ .. హిందీ నుంచి అక్షయ్ కుమార్ నటించినా.. ఆయా భాషల్లో పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఈ సినిమాకు ఇప్పటి వరకు రూ. 25 కోట్ల షేర్ (రూ.50 కోట్ల గ్రాస్) వసూళ్లను దక్కించుకుంది. మొత్తంగా చూసుకుంటే.. కన్నప్ప థియేట్రికల్ రన్ ముగిసిందనే చెప్పాలి. కన్నప్ప మూవీతో తన కెరీర్ లోనే ఎక్కవ వసూళ్లను సాధించినా..పెట్టిన ఖర్చుతో పోలిస్తే తక్కువే అని చెప్పాలి. ఓ రకంగా మిగతా హీరోలకు మంచు విష్ణు ‘కన్నప్ప’ ఓ గుణపాఠం అని చెప్పాలి.
మొత్తంగా కన్నప్పతో మంచు విష్ణు సంతోషించాల్సిన విషయం ఏమిటంటే.. ఈయన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇకపై మంచు విష్ణు తన మార్కెట్ పరిధిని గుర్తించుకొని సెటిల్ గా సినిమాలు చేసుకుంటే హీరోగా కెరీర్ ను నెట్టుకు రావొచ్చని చెప్పొచ్చు. ఈ సినిమాకు వీళ్లు చెప్పినట్టు రూ. 200 కోట్ల ఖర్చు అయినట్టు వార్తల్లో నిజం లేదని సినిమా చూసిన క్రిటిక్స్ తో పాటు ప్రేక్షకులు చెబుతున్నారు. మొత్తంగా నాచురల్ లొకేషన్స్ లో తీయడం ఈ సినిమాకు కలిసొచ్చిన అంశం.
ఇక మహాశివుడిగా నటించిన అక్షయ్ కుమార్ ఆహార్యం కాస్త తెలుగు ప్రేక్షకులను ఇబ్బందులకు గురి చేసింది. ఆయా సీన్స్ ఉన్న సమయంలో గ్రాఫిక్స్ పేలవంగా ఉండటం మినహా మిగతా సినిమా మొత్తం బాగానే ఉంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 81 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటి వరకు వచ్చింది రూ. 25 కోట్ల మాత్రమే. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 55 కోట్ల రాబట్టాలి. కానీ ఇపుడున్నపరిస్థితుల్లో ఈ కలెక్షన్స్ రాబట్టం అసాధ్యమనే చెప్పాలి. కొద్దిలో కొద్దిగా ఈ సినిమాకు డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ హక్కుల రూపంలో దాదాపు రూ.60 కోట్ల వరకు వచ్చింది. ఇది కొద్దిలో కొద్దిగా మంచు విష్ణుకు ఊరట కలిగించే అంశమనే చెప్పాలి.
































