ఈ నెల 23న రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీలు బంద్

తెలంగాణలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్‌ పిలుపునిచ్చాయి. ఈ నెల 23న పాఠశాలలు, జూనియర్ కాలేజీలు బంద్ చేయనున్నట్లు ప్రకటించాయి. విద్యాశాఖకు మంత్రి నియామకం, ఫీజుల నియంత్రణ చట్టం వంటి డిమాండ్లతో ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. హిమాయత్‌నగర్‌లో బంద్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం బంద్ పోస్టర్‌ను హిమాయత్ నగర్‌లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆవిష్కరించారు.


విద్యార్థి సంఘాల డిమాండ్స్…

  • ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి.
  • విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి.
  • ఖాళీగా ఉన్న టీచర్,MEO,DEO పోస్టులను భర్తీ చెయ్యాలి.
  • ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలి.
  • పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలి.
  • అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించి,నిధులు కేటాయించాలి.
  • బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలి.
  • విద్యార్థులకు RTC లో ఉచిత బస్ పాస్‌లు ఇవ్వాలి.
  • NEP 2020 తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలి.

ఈ కార్యక్రమంలో AISF రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ , SFI రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు సహా పలువురు పాల్గొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.