Anantha Padmanabha Swamy Temple: అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో అద్భుతం.. చనిపోయిన బబియా స్థానంలో..
కేరళ: కాసర్గోడ్లోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే. దేశంలోనే అంతులేని సంపదకు ఇది చాలా ప్రసిద్ధి. ఆలయంలోని నేలమాళిగలల్లో రాశుల కొద్ది బంగారం, వజ్రవైఢ్యూర్యాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయనే ఓ వార్త ప్రచారంలో ఉంది.
దీనితో పాటు ఈ ఆలయానికి మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. గుడిలో సరస్సులో ఉండే బబియా మొసలి. ఈ టెంపుల్కి వచ్చినవాళ్లు.. దానిని సందర్శించకుండ వెళ్లరు. ఎందుకంటే ఇది శాఖహార మొసలి. భక్తులు ఇచ్చే పండ్లుఫలహారాలు తప్పు మరేవి తినదు. అందుకే గుడికి వచ్చిన భక్తులు ఈ మొసలిని చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. దాదాపు 70 ఏళ్లుగా ఈ మొసలి ఆ సరస్సులో నివస్తుందని, అది కేవలం శాఖహారం మాత్రమే తినడం విశేషం. అయితే ఎన్నో ఏళ్లుగా ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ ముసలి గతేడాది అక్టోబర్ 9, 2022న మరణించిన సంగతి తెలిసిందే.
ఆలయ అధికారులు, అర్చకులు దానికి ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయం ప్రకారం అంత్యసంస్కరణలు జరిపారు. అయితే ఇప్పుడు ఈ ముసలి స్థానంలో మరో ముసలి సరస్సులో దర్శనం ఇచ్చింది. అది చూసి అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మొసలి ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా వచ్చిందనేది అంతుచిక్కని విషయం. ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి సరస్సులో కనిపించడం అనివార్యంగా వస్తోంది. కానీ ఇలా ఎందుకు జరుగుతుందనేది నేటికి మిస్టరీగానే ఉంది. ఎప్పుడై ఒక మొసలి మాత్రమే ఈ సరస్సులో నివసిస్తుంది.. అదికూడా ఎవరికి హాని చేయకుండ పూజారి పెట్టే ప్రసాదం, భక్తులు ఇచ్చే ఫలాలు తింటూ శాఖహారిగా జీవించడం విచిత్రం. అంతేకాదు సరస్సులో ఉండే చేపలను అసలు ముట్టుకోదట.
ఈ బబియా అనే మొసలి మూడోవది కాగా తాజాగా కనిపించింది నాలుగవ ముసలి అట. బబియా చనిపోయే ముందు దాని వయసు 70 ఏళ్లకు పైనే ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఒకప్పుడూ ఈ సరస్సులో పెద్ద మొసలి ఉండేదని దాన్ని ఆంగ్లేయులు కాల్చి చంపేయగా దాని స్థానంలఅో మరో మొసలి ప్రత్యక్షమైనట్లు ప్రజలు తెలిపారు. అది కూడా చనిపోయాక ఈ బబియా వచ్చింది. ఈ బబియా చనిపోయాక దాని అంత్యక్రియలు చూడటానికి రాజకీయ నాయకులతో సహా వేలాది మంది భక్తులు తరలిరావడం కూడా చర్చనీయాంశమయ్యింది. మళ్లీ ఆ మొసలి స్థానంలో మరో మొసలి రావడం అందర్నీ సంబ్రమాశ్చర్యాలకు గురి చేయడమే గాక భాగవత పురాణంలోని గజేంద్ర మోక్ష కథను గుర్తు చేస్తోంది. నిజానికి మొసళ్లు ఉన్నాయనేలా ఆ ఆలయం సమీపంలో నది లేదా సరస్సు కూడా లేదు. కేవలం ఆలయం కోనేరులోనే కనపించడం విచిత్రం అయితే ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం మరో విచిత్రం.