‘నవోదయ’ రిక్రూట్మెంట్ ఫలితాల విడుదల; ఇలా చెక్ చేసుకోండి..

నవోదయ విద్యాలయ సమితి వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి 2025, మే నెలలో పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్ష ఫలితాలను గురువారం ప్రకటించింది. రిజల్ట్ చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ ఇవ్వబడింది.

నవోదయ విద్యాలయ సమితి వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేసింది. నాన్ టీచింగ్ పోస్టుల పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎన్వీఎస్ అధికారిక వెబ్సైట్ navodaya.gov.in ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.


మే 14 నుంచి 19 వరకు రిక్రూట్మెంట్ పరీక్ష

నవోదయ విద్యాలయ సమితి డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024 కింద 2025 మే 14 నుంచి 19 వరకు రిక్రూట్మెంట్ పరీక్ష నిర్వహించారు. ఆన్సర్ కీని జూన్ 10న విడుదల చేశారు. అభ్యంతరాలు తెలిపేందుకు చివరి తేదీ జూన్ 14, 2025గా నిర్ణయించారు. అభ్యంతరాలను పరిశీలించి తుది ఆన్సర్ కీని విడుదల చేశారు. తాజాగా, రాత పరీక్ష తుది ఫలితాలను ప్రకటించారు.

ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్ తేదీలు

రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను లీగల్ అసిస్టెంట్ పోస్ట్ లకు ఇంటర్వ్యూకు, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, మెస్ హెల్పర్ తదితర పోస్టులకు స్కిల్/ ట్రేడ్ టెస్ట్ కు షార్ట్ లిస్ట్ చేశారు. అభ్యర్థులను నోటిఫై చేసిన ఖాళీల్లో 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేశారు. అధికారిక నోటీసు ప్రకారం, ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ షెడ్యూల్ తగిన సమయంలో నవోదయ సమితి వెబ్సైట్లో అప్లోడ్ చేయబడుతుంది. ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ షెడ్యూల్ గురించి ప్రత్యేకంగా ఎలాంటి సమాచారం ఇవ్వరు.

ఎన్వీఎస్ రిజల్ట్ 2025 చెక్ చేయడం ఎలా?

ఎన్వీఎస్ నాన్ టీచింగ్ పోస్టుల రిక్రూట్మెంట్ 2025 రిజల్ట్ చెక్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

  1. ఎన్వీఎస్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
  2. హోం పేజీలో అందుబాటులో ఉన్న వివిధ నాన్ టీచింగ్ పోస్టుల లింక్ కోసం ఎన్వీఎస్ రిజల్ట్ 2025పై క్లిక్ చేయండి.
  3. కొత్త పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది, అక్కడ అభ్యర్థులు వివరాలను చెక్ చేసుకోవచ్చు.
  4. ఫైలును డౌన్లోడ్ చేసుకుని, తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
  5. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్వీఎస్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.