ఉదయాన్నే నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీటిని తాగడం వల్ల బాడీకి సరిపడా హైడ్రేషన్, జీర్ణక్రియ మెరుగుదల, విటమిన్ C లాంటివి అందుతాయి. అయితే ఈ హెల్త్ టిప్ కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు.
ఇప్పుడు ఈ విషయంపై పూర్తి వివరాలను తెలుసుకుందాం.
పళ్లపై ఎఫెక్ట్
నిమ్మరసం మిగతా సిట్రస్ ఫ్రూట్స్ లాగే ఎక్కువ యాసిడిటీని కలిగి ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తాగడం వల్ల పళ్లపై ఉండే ఎనామెల్ (Enamel) బలహీనపడిపోతుంది. దాంతో పాటు పళ్లు సెన్సిటివ్ గా మారి.. కొంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. నిమ్మరసం తాగేటప్పుడు స్ట్రా వాడి డైరెక్ట్‌గా పళ్లకి తగలకుండా తాగాలి. తాగిన వెంటనే నోరు నార్మల్ వాటర్ తో బాగా పుక్కిలించాలి. వెంటనే పళ్లు తోమడం అవాయిడ్ చేయాలి.. ఎందుకంటే ఆ టైంలో ఎనామెల్ వీక్ గా ఉంటుంది.
అజీర్ణం, గుండె మంట
నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కొంతమందికి జీర్ణ సమస్యలను తగ్గించినా.. GERD (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్) లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లలో ఇది తీవ్రమైన గుండె మంటకు దారి తీస్తుంది. ఇది యాసిడ్ ను అన్నవాహికలోకి వెళ్లనిచ్చి మంటను కలిగిస్తుంది. గుండె మంట లేదా కడుపు మండే సమస్యలున్నవాళ్లు నిమ్మరసాన్ని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. తాగిన వెంటనే ఛాతిలో లేదా గొంతులో మంట అనిపిస్తే.. వెంటనే ఆపేయాలి.
జీర్ణక్రియ అసౌకర్యం
నిమ్మరసం కొందరికి జీర్ణం ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తే.. మరికొందరికి అసౌకర్యాన్ని కలిగించవచ్చు. దీని యాసిడిటీ కడుపు గోడను ఇరిటేట్ చేసి వాంతులు, గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం లాంటి ప్రాబ్లమ్స్ తీసుకురావచ్చు.
స్కిన్ కి జాగ్రత్త అవసరం
నిమ్మరసంలో ఉండే విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ కి మంచివి. అయితే డైరెక్ట్ గా చర్మంపై రాస్తే కొందరికి రాషెస్, ఎరుపు లేదా స్కిన్ పీలింగ్ లాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ కనిపించవచ్చు. నిమ్మరసాన్ని స్కిన్ పై రాసిన తర్వాత కనీసం 2 గంటల పాటు సూర్యరశ్మికి దూరంగా ఉండాలి. లేకపోతే ఫోటోసెన్సిటివిటీ (Photosensitivity) అనే ప్రాబ్లమ్ వస్తుంది.
గోళ్లు, చేతులపై ఎఫెక్ట్
నిమ్మరసంలో ఉండే ఆమ్ల పదార్థాలు గోళ్లలో ఉండే కెరాటిన్‌ను (Keratin) బలహీనపరుస్తాయి. దీని వల్ల గోళ్లు విరిగిపోవడం, చిలికిపోవడం లాంటి సమస్యలు రావచ్చు. నిమ్మరసం తరచుగా తాకాల్సిన అవసరం ఉంటే.. చేతులకు గ్లవ్స్ వేసుకోవడం మంచిది.
నిమ్మకు అలర్జీ ఉంటే
కొంతమందికి నిమ్మకాయలు లేదా ఇతర సిట్రస్ పండ్లకు అలర్జీ ఉండొచ్చు. ఇది కొన్నిసార్లు స్కిన్ పై పగుళ్ల నుంచి అనాఫిలాక్సిస్ (Anaphylaxis) అనే ప్రాణాంతక పరిస్థితి వరకు తీసుకెళ్లవచ్చు. నిమ్మరసం తాగిన తర్వాత బాడీలో అసాధారణమైన లక్షణాలు కనిపిస్తే (ఉదాహరణకు శ్వాసలో ఇబ్బంది, స్కిన్ ఎర్రబడటం) వెంటనే డాక్టర్ ని కలవాలి.
మందులపై ప్రభావం
నిమ్మరసంలోని కొన్ని పదార్థాలు కొన్ని మందుల పనితీరును ఎఫెక్ట్ చేయవచ్చు. ముఖ్యంగా లివర్ ద్వారా ప్రాసెస్ అయ్యే మెడిసిన్స్ ప్రభావం మారిపోవచ్చు. ఎప్పుడైనా మందులు వాడుతున్నవాళ్లైతే.. నిమ్మరసాన్ని రోజూ తాగే అలవాటు చేసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
నిమ్మరసం తాగడం వల్ల హెల్త్ కి మంచి బెనిఫిట్స్ ఉన్నా.. అందరికీ ఇది సెట్ అయ్యే ఫుడ్ కాదని గుర్తుంచుకోవాలి. మీ శరీరం స్పందనను గమనించండి. ప్రత్యేకించి పళ్ల సమస్యలు, గుండె మంట, అలర్జీ లేదా మందులు వాడుతున్నవాళ్లు డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
































