పహల్గామ్ శాపం..? కొట్టుకుపోతున్న పాకిస్థాన్..

పాకిస్థాన్ పై ప్రకృతి కన్నెర్ర చేసింది. భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. జూన్ 26 నుంచి వరదలు పాకిస్థాన్ ను ముంచెత్తుతున్నాయి. 116 మంది వరదల కారణంగా మృతి చెందారు.


మరో 253 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ(NDMA) ధృవీకరించింది. తాజాగా వర్షాల ధాటికి మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. మరో 41 మంది గాయపడినట్లు వివరించింది.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పాకిస్థాన్ లోని అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను లోతట్టు ప్రాంతాలకు తరలిస్తున్నారు. రావల్ పిండి, గావల్ మండి, కటారీయాన్ నగరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సమీప సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఇస్లామాబాద్ లో నీటి మట్టం అమాంతం పెరిగినట్లు పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులు తెలిపారు.

లాయ్ నుల్లా బేసిన్ పరిసర ప్రాంత ప్రజలకు ఈ మేరకు అలెర్ట్ జారీ చేశారు. వరదల కారణంగా బేసిన్ లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోందన్నారు. ఈ మేరకు స్థానిక ప్రజలను తరలిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా పంజాబ్ ప్రావిన్స్ లోని పలు ప్రాంతాలతోపాటు జంట నగరాలైన ఇస్లామాబాద్, రావల్ పిండి అతలాకుతలం అవుతున్నాయి. ఇస్లామాబాద్, రావల్ పిండిలో భారీ వర్షపాతం నమోదవుతోంది. కేవలం 10 గంటల్లోనే 400 ఎంఎం వర్షం పడినట్లు పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ పేర్కొంది.

మరోవైపు దేశవ్యాప్తంగా భారీగా ఉరుములు మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం ఉందని జులై 17న పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ వార్నింగ్ ఇచ్చింది. పోటోహర్ ప్రాంతం, పంజాబ్, అప్పర్ ఖైబర్ పక్తుఖ్వా, బలూచిస్థాన్ లోని పలు ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే పాకిస్థాన్ పై ప్రకృతి పగబట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. పహల్గామ్ శాపంగా కొందరు నెటిజెన్లు ట్వీట్ చేస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ టూరిస్ట్ ప్రదేశంలో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.