మీ ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేశారో లేదో ఎలా చెక్ చేసుకోవాలి తెలుసా?

టీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిపోయింది. కేవలం ఫోన్ మాట్లాడేందుకు మాత్రమే కాదు, బ్యాంకింగ్, సోషల్ మీడియా, ఆఫీస్ వర్క్, ఫోటోలు మరియు వీడియోలు ఇలా ఎన్నో పనులకు నిత్యం స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు.


స్మార్ట్ ఫోన్ వినియోగం ఎంతలా పెరిగిపోయిందో, మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. అయితే మీ ఫోన్‌ను ఎవరైనా సీక్రేట్ గమనించడం, స్పై చేస్తున్నట్లు అనిపిస్తుందా ? మొబైల్ ఫోన్ హ్యాకింగ్ చాలా సులభంగా చేస్తున్నారు మోసగాళ్లు.

ఫోన్ హ్యాకింగ్ అంటే ఏంటి !
సింపుల్‌గా చెప్పాలంటే ఫోన్ హ్యాకింగ్ అంటే, ఇతరులు మీ ఫోన్‌ను, అందులోని సమాచారాన్ని వారి కంట్రోల్‌లోకి తీసుకోవడం. కొన్ని సందర్భాల్లో మీ ఫోన్‌లోకి మాల్వేర్, స్పైవేర్ పంపించి ఫోన్‌ను హ్యాక్ చేస్తారు. దీని ద్వారా మీ బ్యాంకులో డబ్బులు ,మీ గుర్తింపును , వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తారు. అయితే ఇదంతా మీకు తెలియకుండానే జరుగుతుంది, ఫోన్ హ్యాకింగ్‌కు గురైన కొన్ని రోజులు, వారాలకు మీకు తెలుస్తుంది.

హ్యాకింగ్ ఎలా జరగవచ్చు !
హ్యాకర్స్‌ మీ ఫోన్‌లోనే డేటాను తస్కరించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఏవైనా గుర్తు తెలియని యాప్స్ డౌన్‌లోడ్స్ చేయడం,అసురక్షితమైన వెబ్‌సైట్స్ ద్వారా మీ ఫోన్‌లోకి మాల్వేర్ డౌన్‌లోడ్ అవ్వడం ద్వారా ఫోన్ హ్యాకింగ్‌ అయ్యే ప్రమాదం ఉంది.
ఫిషింగ్ మెసేజెస్…కొరియర్ అప్‌డేట్స్, బ్యాంకింగ్ అలర్ట్స్, లేదా OTP రిక్వెస్ట్‌ల ద్వారా కూడా ఫోన్‌ను హ్యాక్ చేస్తారు. మరికొన్ని సందర్భాల్లో పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అవ్వడం ద్వారా మీ ఫోన్ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది. సైబర్ నేరగాళ్లు సిమ్ స్వాప్ ద్వారా హ్యాక్ చేయవచ్చు.

మీ ఫోన్ హ్యాకింగ్ గురైనట్లు ఎలా తెలుసుకోవాలి?

మీ స్మార్ట్‌ఫోన్ ఉన్నట్లుండి వేడెక్కడం, ఫోన్ బ్యాటరీ త్వరగా తగ్గిపోవడం, డేటా వినియోగం చాలా ఎక్కువగా ఉండటం,మీకు తెలియని అప్లికేషన్స్ ఫోన్ లో కనిపించడం, పాప్-అప్స్, ఫోన్ స్లోగా పనిచేయడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి.మరికొన్ని సందర్భాల్లో మీ కాంటాక్ట్స్‌కు వింత మెసేజెస్, మీ నంబర్‌ నుండి వెళతాయి.

ఫోన్ హ్యాకింగ్ గురైతే ఏం చేయాలి?
1 .మీ ఫోన్ హ్యాకింగ్‌కు గురైనట్లు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైఫై మరియు మొబైల్ డేటా ఆఫ్ చేసి ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలి.
2. మీరు ఇన్‌స్టాల్ చేయనటువండి యాప్స్‌ను ఫోన్‌ నుండి తొలగించాలి.
3. మీ ఫోన్‌లోని ఈమెయిల్, బ్యాంకింగ్ యాప్స్, సోషల్ మీడియా వంటి ముఖ్యమైన అకౌంట్స్ యెక్క లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్స్ వెంటనే మార్చేయాలి. అవి పనిచేయకపోతే, డేటాను బ్యాకప్ చేసుకుని, ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి.
4. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేసి, మీ సిమ్‌పై ఏవైనా అనధికారిక యాక్టివిటీస్ జరిగాయేమో తెలుసుకోవాలి.

మీ ఫోన్ హ్యాక్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !

– గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుండి మాత్రమే అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
– మీ స్మార్ట్‌ఫోన్‌ను లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ చేసుకోవాలి.
– మీ ఫోన్ స్క్రీన్ లాక్ ధృడమైనదిగా సెట్ చేసుకోవాలి. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసుకోవడం మంచిది. పబ్లిక్ వైఫై వాడే సందర్భంలో తప్పనిసరిగా VPN వాడటం మంచిది.

Disclaimer:
పైన తెలిపిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే….పాటించేముందు సంబంధిత నిపుణుల సలహా పాటించడం తప్పనిసరి!

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.