హైదరాబాద్ స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ కు మరో శుభవార్త అందించింది తెలంగాణ గవర్నమెంట్. రాబోయే శనివారం జూలై 19తో పాటు జూల 21న సెలవులు ప్రకటించింది. దీంతో శనివారం నుంచి వరుసగా మూడు రోజలు పాటు స్కూల్లకు హాలీడేస్ ఉండనున్నాయి. హైదరాబాద్ బోనాల నేపథ్యంలో ఈ సెలవులు ప్రకటించింది పాఠశాల విద్యాశాఖ.
ప్రతి యేడాది దాదాపు జూలై నెలలోనే ఆషాఢ మాసం వస్తుంది. ఈ సందర్భంగా భాగ్యనగర వాసులు అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలకు ప్రతీక నిలిచే బోనాలు నగరంలో ఒక్కో వారం ఒక్కో ఆదివారం అమ్మవారి బోనాల జాతర నిర్వహిస్తూ వస్తుండటం ఆనవాయితీగా వస్తోంది.
ఇక బోనాలు ప్రతి ఆదివారం నిర్వహిస్తూ ఉంటారు. బోనాల తర్వాత వచ్చే సోమవారం అమ్మవారి ఊరేగింపు జాతర పాటు రంగం నిర్వహిస్తూ ఉంటారు. ఆ సందర్భంగా రాబోయే రోజుల్లో రాష్ట్రం, దేశం ఎలా ఉండబోతుందనేది కొంత మంది అమ్మవారి పూనిన భక్తురాళ్లు జోస్యం చెబుతుంటారు. దాదాపు ఆ జోస్యం చెప్పినట్టుగా అన్ని జరిగిపోతూ ఉంటాయి.
రంగం, అమ్మవారి ఊరేగింపు చూడటానికి హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ ప్రజలే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్,కర్ణాటక, ఒడిషా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు.
ఇక బోనాలు ఉత్సవాలను ఆషాఢ మాసంలోని మొదటి, మూడో, నాల్గో ఆదివారాలు జరుపుకోవడం ఆనవాయితీ వస్తోంది. మొదటి వారం గోల్కొండ బోనాలు.. మూడో ఆదివారం లష్కర్ బోనాలు.. నాల్కో ఆదివారం లాల్ దర్వాజ బోనాలు ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.
ఆషాఢ మాసంలో బోనాల సందర్భంగా నాల్గో ఆదివారం హైదరాబాద్ బోనాలను ప్రజలను ఘనం నిర్వహించుకుంటూ రావడం ఆనవాయితీ వస్తోంది. లష్కర్ బోనాల తర్వాత లాల్ దర్వాజాలో కొలువైన అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో పాతబస్తీలో పలు అమ్మవారి ఆలయాలను ముస్తాబు చేసారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో సందడి వాతావరణం నెలకొని ఉంటుంది.
ఈ నేపథ్యంలో పాతబస్తీలోని ఉండే స్కూల్లకు ఈ జాతర సందర్భంగా శనివారం సెలవు మంజూరు చేశారు. భక్తుల తాకిడి, హడావుడి నేపథ్యంలో శని వారం జాతర ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలకు సెలవు ఇవ్వనున్నారు.మరోవైపు జాతర నేపథ్యంలో సోమవారం సెలవు ప్రకటించింది పాఠశాల విద్యాశాఖ. ఈ శనివారం ఇచ్చే సెలవును ఆగష్టులో వచ్చే రెండో శనివారం పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో విద్యార్ధులకు వరుసగా 19,20, 21 తేదిల్లో ఆదివారంతో కలుపుకొని మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఆయా ప్రాంతాల్లో బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థలు యథావిధిగా పనిచేయనున్నాయి.
































