పిస్తా పప్పును అసలు రోజుకు ఎంత పరిమాణంలో తినాలి..? దీంతో ఏమేం లాభాలు కలుగుతాయి.

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తినాలన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాహారాల విషయానికి వస్తే నట్స్ ఎంతో ప్రాధాన్యతను చోటు చేసుకున్నాయి.


చాలా మంది నట్స్‌ను తింటుంటారు. వాటిల్లో పిస్తా కూడా ఒకటి. అయితే వీటిని రోజుకు ఎన్ని తినాలి.. ఎంత పరిమాణంలో వీటిని తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయి.. అన్న వివరాలు చాలా మందికి తెలియవు. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం పిస్తాపప్పును రోజుకు గుప్పెడు మోతాదులో తినవచ్చు. అంటే సుమారుగా 30 గ్రాములు అన్నమాట. గుప్పెడు పిస్తాపప్పును తింటే సుమారుగా 160 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు 13 గ్రాములు, ప్రోటీన్లు 6 గ్రాములు, పిండి పదార్థాలు 8 గ్రాములు లభిస్తాయి. ఫైబర్ 3 గ్రాముల వరకు లభిస్తుంది. పిస్తా పప్పులో విటమిన్ బి6, బి1, కె, ఇ అధికంగా ఉంటాయి. మాంగనీస్‌, కాపర్, ఫాస్ఫరస్‌, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్‌, జింక్‌, సెలీనియం అధికంగా ఉంటాయి.

గుండె ఆరోగ్యానికి..

పిస్తా పప్పులో మోనో అన్‌శాచురేటెడ్‌, పాలి అన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఈ పప్పులో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. ఈ పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతోపాటు రక్త నాళాల్లో ఏర్పడే వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. పిస్తా పప్పు గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ పప్పును తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. పైగా ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక ఈ పప్పును తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి పిస్తా పప్పు ఎంతగానో మేలు చేస్తుంది. దీంతో షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

బరువు తగ్గేందుకు..

పిస్తా పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఫైబర్ కారణంగా మలబద్దకం తగ్గుతుంది. పిస్తా పప్పు ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తుంది. ఈ పప్పును తింటే జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. పిస్తాపప్పులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ ఈ పప్పును తింటే బరువు పెరగరు. పైగా ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ బరువును తగ్గిస్తాయి. పిస్తా పప్పును తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు పిస్తాపప్పును రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.

కంటి ఆరోగ్యానికి..

పిస్తాపప్పు కంటి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని తింటే అనేక యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ పప్పులో లుటీన్‌, జియాజాంతిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. రెటీనాను సంరక్షిస్తాయి. దీంతో వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే కంటి చూపు సైతం మెరుగు పడుతుంది. ఈ పప్పులో అధికంగా ఉండే విటమిన్ బి6, జింక్‌, కాపర్ శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు త్వరగా తగ్గుతాయి. పిస్తా పప్పును తింటే శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులు తగ్గిపోతాయి. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించవచ్చు. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. ఇలా పిస్తా పప్పును ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.