ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో కీలక పరిణామం చోటుచేసకుంది. కేసు ఛార్జిషీటులో ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) పేరును చేర్చడంతో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు (High Court)లో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
కానీ, ఆయన పిటిషన్ విచారణ చేపట్టి పూర్తి వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో మిథున్ రెడ్డి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఆ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టగా..
ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఎంపీ మిథున్ రెడ్డి తరఫున తన వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు వ్యక్తిని అరెస్ట్ చేయకుండా కేసులో ఛార్జ్‌షీట్ ఎలా దాఖలు చేస్తారని ఆక్షేపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.
































