కృష్ణా జిల్లా మచిలీపట్నం(Machilipatnam)లో పెను సంచలనం నమోదు అయింది. 19 మంది వైసీపీ(Ycp) నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నిందితుడిగా మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టు ఉన్నారు.
ఇప్పటివరకూ ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. టీడీపీ(Tdp) నేత బొడ్డు శ్రీనివాస్(Boddu Srinivas) ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు చర్యలు చేపట్టారు.
కాగా గురువారం మచిలీపట్నంలో హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) పర్యటించారు. ఈ సందర్బంగా మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే హోంమంత్రి వెళ్లకముందే ఈ రూట్ లో కొంతమంది వైసీపీ నేతలు ఆందోళనలు నిర్వహించారు. భారీగా చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశంతో హోంమంత్రి పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే వైసీపీ నేతలు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించినట్లు టీడీపీ నేత బొడ్డు శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
































