సింగిల్​ ఛార్జ్​తో 142 కి.మీ రేంజ్​- మిడిల్​ క్లాస్​ వారి కోసమే ఈ అఫార్డిబుల్​ ఎలక్ట్రిక్​ స్కూటర్

కొత్తగా ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో మోస్ట్​ అఫార్డిబుల్​ ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఒకటైన విడా వీఎక్స్​2 గురించి మీరు తెలుసుకోవాలి. ఈ మోడల్​ రేంజ్​, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..


ఈ విడా వీఎక్స్​2 ఈ నెలలోనే లాంచ్​ అయ్యింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి.. వీఎక్స్‌2 గో, వీఎక్స్‌2 ప్లస్. విడా వీఎక్స్‌2 రెండు వేరియంట్లు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్‌తో కూడా లభిస్తున్నాయి. వీఎక్స్‌2 గో ధర రూ. 99,490 (ఎక్స్-షోరూమ్) కాగా, వీఎక్స్‌2 ప్లస్ ధర రూ. 1.10 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది.

మీరు ఒకవేళ బ్యాటరీ యాజ్​ ఎ సర్వీస్​ స్కీమ్​ని ఎంచుకుంటే.. వీఎక్స్‌2 ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర రూ. 59,490 (ఎక్స్-షోరూమ్), వీఎక్స్‌2 ప్లస్ ధర రూ. 64,990 (ఎక్స్-షోరూమ్) అవుతుంది. ఈ ప్లాన్‌లు రోజువారీ వినియోగం, రన్నింగ్ విధానాలపై ఆధారపడి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కీమ్​ కింద., యజమాని కిలోమీటరుకు రూ. 0.96 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

విడా వీఎక్స్‌2 గోలో రిమూవెబుల్​ 2.2 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 92 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను ఇస్తుంది. దీని గరిష్ట వేగం 70 కేఎంపీహెచ్!. మరోవైపు, టాప్ వేరియంట్ విడా వీఎక్స్‌2 ప్లస్ 3.4 కేడబ్ల్యూహెచ్​ సామర్థ్యంతో రెండు రిమూవెబుల్​ బ్యాటరీ ప్యాక్‌లను పొందింది. ఇది పూర్తి ఛార్జ్‌పై 142 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను ఇస్తుంది.

ఈ అఫార్డిబుల్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​కి ఫాస్ట్​ ఛార్జర్​ ఆప్షన్​ కూడా లభిస్తోంది. ఈ ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీ ప్యాక్‌ను ఒక గంటలో 0-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని విడా చెప్పింది. బండిల్‌తో వచ్చే ఛార్జర్ ఆరు గంటల్లో బ్యాటరీ ప్యాక్‌ను 0-80 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఈ ఈ-స్కూటర్ కేవలం​ 3.1 సెకన్లలో 0-40 కేఎంపీహెచ్​ వేగానికి చేరుకుంటుంది. దీని టాప్​ స్పీడ్​ 80 కేఎంపీహెచ్​ వరకు ఉంటుంది.

విడా వీఎక్స్​2లో 33.2-లీటర్ అండర్-సీట్ బూట్, సౌకర్యవంతమైన ఫ్రెంట్​ కంపార్ట్‌మెంట్ వంటివి ఉన్నాయి. అండర్‌సీట్ స్టోరేజ్ బ్యాగులు, బాటిల్స్ వంటి వాటికి తగినంత స్థలాన్ని అందిస్తుంది. ఫ్రంక్ కీలు, కేబుల్స్, ఛార్జర్ వంటి వాటిని ఉంచుకోవడానికి స్పేస్​ ఉంటుంది. పొడవైన సీటు దీని సొంతం! ఇది రైడర్, పిలియన్ రైడర్‌కు విశాలమైన సీటింగ్​ ఎక్స్​పీరియెన్స్​ని ఇస్తుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.