పాత బట్టలు పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే డబ్బే డబ్బు

మీ పాత బట్టలతో కొంత అదనపు డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం! హైదరాబాద్‌లో మీరు పాత బట్టలు అమ్మి డబ్బు సంపాదించగలిగే మంచి అవకాశాలు ఉన్నాయి.


డిజైనర్ డ్రెస్సుల నుండి డైలీ వేర్ వరకూ.. ఏదైనా అమ్మే వీలు ఉంది. మీరు ఆన్‌లైన్ లోనైనా లేదా నేరుగా స్థానిక మార్కెట్లలోనైనా వాటిని అమ్మి డబ్బు సంపాదించుకోవచ్చు. మీరు ధరించని పాత బట్టలు అమ్మడం వల్ల ఇంట్లో స్థలం కూడా ఖాళీ అవుతుంది. కొంత అదనపు డబ్బు కూడా వస్తుంది.

మీరు మీ పాత బట్టలను స్థానికంగా ఉన్న కన్సైన్‌మెంట్ షాపుల దగ్గర అమ్మవచ్చు. అంటే కొన్ని షాపులలో మీ పాత బట్టలు తీసుకుని డబ్బు ఇస్తారు. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో అమ్మాలనుకుంటున్నట్లయితే ముందుగా వాటిని మంచిగా వాష్ చేసి పెట్టండి. తర్వాత వాటిని చక్కగా మడత పెట్టి ఫొటోలు తీయండి. బ్యాక్‌గ్రౌండ్‌ క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి. మీ బట్టలకు సంబంధించిన ప్రముఖ బ్రాండ్లు, పరిమాణం వంటివి వివరంగా రాసి ఈ కింది ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేయండి. సంబంధిత కంపెనీ వాళ్లు మీ బట్టల కోసం మీ ఇంటి దగ్గరకు వచ్చి వాటిని తీసుకుని మీకు డబ్బు ఇస్తారు.

బట్టలు అమ్మడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఇవే :

  • Myntra యాప్‌లో ఫ్యాషన్‌కు సంబంధించిన బ్రాండెడ్ బట్టలు అమ్మవచ్చు.
  • OLX యాప్‌లో బట్టలతో పాటు ఇతర ఉత్పత్తులను కూడా అమ్మే అవకాశం ఉంది.
  • Facebook Marketplace వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ కూడా మీ బట్టలు అమ్మడానికి మంచి ఎంపిక.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.