తమిళ స్టార్ హీరో అజిత్(Actor Ajith)కు మరోసారి ప్రమాదం(Car Accident) జరిగింది. ప్రస్తుతం ఇటలీలోని మిసానోలో జరుగుతున్న GT4 యూరోపియన్ కార్ రేసింగ్ లో అజిత్ పాల్గొంటున్నారు.
అయితే ఈరోజు మధ్యాహ్నం జరిగిన కార్ రేసింగ్ 2 లో ట్రాక్ మధ్యలో ఆగి ఉన్న కారును, అజిత్ ప్రమాదవశాత్తూ తన కార్ తో ఢీకొట్టారు. అయితే ఈ ప్రమాదంలో అజిత్ కు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. కాని ఈ పోటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాగా ఈ ఘటన అనంతరం అజిత్ ట్రాక్ క్లీనింగ్ లో వర్కర్లకు సహాయం చేయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో సూపర్ హిట్ సొంతం చేసుకున్న అజిత్, నెక్స్ట్ వేల్స్ ఇన్ పతాకంలో ‘AK 64’లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 మేలో విడదల కానుంది.

































