ఉద్యోగాల్లో ఆదాయానికి ఒక లిమిట్ ఉండొచ్చు. అదే వ్యాపారాల్లో అన్ లిమిటెడ్. పైగా ఫ్రీ టైం దొరుకుతుంది. వ్యాపారం చేస్తే ఆ సంతృప్తి వేరు..అయితే బిజినెస్ చేయాలనుకునే వారికి అతిపెద్ద సమస్య పెట్టుబడి. ఏం చెయ్యాలన్నా భారీ మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలి, పైగా నష్ట భయం ఉంటుంది. అదే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశం ఉంటే. ఇప్పుడడదే ట్రెండింగ్ బిజినెస్. పైగా ఎవరైనా చెయ్యొచ్చు. చాలా చిన్న సెటప్ సరిపోతుంది. రిస్క్ కూడా చాలా తక్కువ… అలాంటి బిజినెస్ ఐడియా మీకోసం…
50000 లతో పెట్టుబడి. నెలకి కనీసం 75000 నుండి ఒక లక్ష వరకు ఆదాయం అంటే..అలాంటి బిజినెస్ లు ఏముంటాయి అనుకుంటున్నారు కదా. మైండ్ పెట్టి వెతకాలి కానీ బోల్డన్ని బిజినెస్ ఐడియా లు దొరుకుతాయి, అది కూడా నష్టభయం లేకుండా. అటువంటి వ్యాపారమే ఫుడ్ బిజినెస్. అబ్బో ఫుడ్ బిజినెస్ పెట్టాలంటే మన వల్ల ఎక్కడవుతుంది. కమర్షియల్ స్పేస్ ఉండాలి, వంటవాళ్ళతో పడలేం, బోల్డంతమంది వర్కర్లు ఉండాలి, లక్షల్లో పెట్టుబడి ఇలా ఆలోచిస్తున్నారు కదా..అవేమి లేకుండా కేవలం ఒక 50 వేలతో మొదలుపెట్టే సూపర్ ప్లాన్ తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే….
ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపొయింది. బట్టలు, బంగారం దగ్గరనుండి ఆహారం వరకు ఇంటికి వచ్చేస్తున్నాయి. మన బిజినెస్ ఐడియా కూడా అదే. ఒక కిచెన్ పెట్టి నచ్చేలా టేస్టీ ఫుడ్ వండి అమ్మగలిగితే ఆలోచన బాగుంది కదా..సో ఈ ఐడియా నే క్లౌడ్ కిచెన్. దీనికి పెద్దగా సెటప్ అవసరం ఉండదు. కమర్షియల్ ఏరియాలో ఒక చిన్న స్పేస్ అది కూడా మెయిన్ ఏరియాలో అవసరం లేదు కాస్త రోడ్డుకు దగ్గరగా ఉంటే చాలు. షాప్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చిన్న సెపెరేట్ కిచెన్ పెట్టుకునే స్పేస్ అయితే చాలు.
నెలకి ఒక 7000 అద్దెతో ఇలాంటి స్పేస్ దొరికే ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఒక ప్లేస్ లో సింపుల్ గా ఒక కిచెన్ సెటప్ చెయ్యటమే. దానికోసం ఒక స్టవ్, కమర్షియల్ గ్యాస్ కనెక్షన్, ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇంకా fssai లైసెన్సు, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి మొత్తం పెట్టుబడి డిటైల్ మీకు ఒక 40000 దాటదు. ఆన్లైన్ లో వెతికితే మీకు ఫ్రిడ్జ్ లు సెకండ్ హాండ్స్లో మీకు 3000 కు దొరుకుతాయి. లైసెన్స్ కోసం మీరు ఒక 8 నుండి 10 వేలు వరకు ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది. కమర్షియల్ ఏరియా లో చిన్న స్పేస్ కనుక అద్దెకు తీసుకుంటే వాటికి తిరిగి ఇచ్చే ప్రాతిపదికన కొంత అడ్వాన్స్ ఉంటుంది. అదే సొంత స్పేస్ అయితే ఆ ఖర్చు తగ్గుతుంది.
ఇక అన్నిటికంటే ముఖ్యమైంది ఏమి ఫుడ్ అమ్మాలి అనేది. దీనికోసం మీరు వంటవాళ్ళని పెట్టుకోకుండా ఒక వర్కర్ సహకారం తో మీరే చేయగలిగేలా అయితే మీకు బాగా వచ్చిన ఐటెంని చేసి అమ్మవచ్చు. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడేది మధ్యాహ్నం లంచ్ కోసం. మార్నింగ్ లేచి వంటచేసుకుని రాలేరు. సరై ఫుడ్ దొరకదు. వారిని టార్గెట్ చేసి సింపుల్ గా సాంబార్ రైస్, లేదా కొంచెం అన్నం, పప్పు, ఒక పచ్చడి, కొంచెం పెరుగు ఇలా ఫుల్ మీల్ హోమ్ ఫుడ్ అందించగలిగితే చాలు. అదే మీరు యూత్ ని టార్గెట్ చేసినట్టయితే పిజ్జా చేసి అమ్మవచ్చు, లేదంటే మీకు కిచిడి చెయ్యటం బాగా వచ్చు అంటే కిచిడి స్పెషల్ అని ఒక ప్యాక్ లా అమ్మవచ్చు. మీకు బిర్యానీ చెయ్యటం చాలా బాగా వచ్చు అంటే బిర్యానీ ని తక్కువ కాస్ట్ లో తయారు చేసి డెలివరీ ఇవ్వగలిగితే లాభాలే లాభాలు. అయితే ఇక్కడ ఒకటే విజయ సూత్రం. రుచి. అది మాత్రమే మీకు కస్టమర్లను తెచ్చి పెడుతుంది.
క్లౌడ్ కిచెన్ సెటప్ చేసారు, ఫుడ్ ఐటెం ఏమి అమ్మాలో డిసైడ్ అయ్యారు మరి అమ్మేదెలా..సింపుల్ స్విగ్గీ, జొమాటో వంటి డెలివరీ యాప్ లతో టై అప్ అవ్వండి. జొమాటో వంటి ఫుడ్ యాప్ లతో లింక్ అవ్వాలంటే వారి వెబ్సైటు కి వెళ్లి అప్లై చేసుకుంటే వారి టీమ్ వచ్చి కిచెన్ వెరిఫై చేస్తుంది. అన్ని సరిగా ఉన్నాయి అనుకుంటే మిమ్మల్ని వారితో లింక్ చేస్తుంది. సో డెలివరీ అండ్ ఆర్డర్స్ సమస్య తీరిపోయినట్టే. కాకపోతే వీటికోసం ప్రతి డెలివరీ పైన వారు కొంత మొత్తం కమిషన్ తీసుకుంటారు.
దీంతో పాటు మీరు సొంతం గా పేస్ బుక్, instagram వంటి పేజీలు ఓపెన్ చేసి మీ కిచెన్ గురించి ప్రచారం చేసుకుంటే డైరెక్ట్ ఆర్డర్లు కూడా వస్తాయి. ఇదీ సింపుల్ బిజినెస్ ఐడియా. ఒక్కసారి మీరు సక్సెస్ అయితే మీరు వెనక్కు తిరిగి చూడరు. ఇప్పుడు క్లౌడ్ కిచెన్ అనేది ఇండియన్ లో ఒక ట్రెండింగ్ బిజినెస్. ఫసోస్, బెహ్రోజ్, బాక్స్ 8, బిర్యానీ బై కిలో, టిఫిన్ బాక్స్ లాంటి అనేక క్లౌడ్ కిచెన్ లు ఈ రోజు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి.
DISCLAIMER : ఈ బిజినెస్ ఐడియా కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది నగరాల్లో నివసించేవారిని దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరిగింది. ఇందులో ఇచ్చిన పెట్టుబడి వివరాలు కేవలం అంచనా మాత్రమే. వాస్తవం లో వాటి ధరల్లో ఎక్కువ తక్కువ మార్పులు ఉండవచ్చు. ఇది వ్యాపారానికి ఇచ్చే సలహా కాదు. ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు మీ ఫైనాన్సియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి.
































