అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునుంచేవిదేశీయులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రత్యేకంగా వలసదారులపై కొరడాను ఝళిపిస్తున్నారు.ఇప్పటికే రెండుదఫాలుగా భారతీయులను ఇండియాకు ప్రత్యేకవిమానంలో వెనక్కిపంపిన విషయం విధితమే.
అక్రమ వలసదారులను (Illegal immigrants) వెనక్కి పంపడమే కాకుండా, కొత్తగా అమెరికాకు వచ్చేవారిపై పలు ఆంక్షలను విధిస్తున్నారు. దీనిలో భాగంగా వీసా నిబంధనల్లో పలు కఠిననియమాలకు నిర్ణయాలు తీసుకున్నారు. డిపార్డ్ మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రతిపాదనను శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యూలేటరీ అఫైర్స్ ఫర్ రివ్యూ కార్యాలయానికిపంపింది. హెచ్-1బీ వీసాలు జారీ పరిమితిని ఏటా కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అది85,000గా ఉన్నాయి. వీటిలో 20,000 వీసాలు మాస్టర్స్ డిగ్రీ (Masters degree) చేసిన వర్కర్ల కోసంచేశారు. ఎలాంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం జారీచేస్తారు.
లాటరీ విధానం ఉండకపోవచ్చు..
రిజర్వుతాజాగా ఈ విధానాన్ని నిలిపివేసినట్లు ఇటీవల యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ప్రకటించింది. దీనికి కారణం 2026 వార్షిక పరిమితికి తగినన్ని దరఖాస్తులు రావడమే. దీంతో2026 ఏడాదికి లాటరీ విధానం బహుశా ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. లాటరీవిధానంలో వీసాదారులను ఎంపిక చేస్తారు. జీతం, సీనియార్టీ ఆధారంగా వీసాలు జారీ చేస్తేవాటి ఆర్థిక విలువలు 88శాతం పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ట్రంప్ రెండోసారిఅధికారంలోకి వచ్చాక పోస్టుకు ఆఫర్ చేస్తున్న వేతనం ఆధారంగా వీసాలు జారీ చేశారు. డీవాచ్ఎస్ పంపిన ప్రతిపాదనపై వెయ్యి వరకు పబ్లిక్ కావమెంట్లు వచ్చినట్లు బ్లూమ్ బెర్గ్ రిపోర్ట్ (Bloomberg Report) చేసింది. తమ దేశ చట్టాలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని ట్రంప్ ప్రకటించడమేకాక ఇప్పటికే పలువురి విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. వారిని ఉన్నపళంగా దేశాన్ని వదిలేసి వెళ్లాల్సిందిగా హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే.
అమెరికాలో ఎన్ని రాష్ట్రాల పేర్లు ఉన్నాయి?
యునైటెడ్ స్టేట్స్ యొక్క 50 రాష్ట్రాలు, సమాఖ్య జిల్లా, ఐదు జనావాస ప్రాంతాలను చూపించే మ్యాప్. అలాస్కా, హవాయి, భూభాగాలు వేర్వేరు ప్రమాణాలలో చూపించబడ్డాయి.అలూటియన్ దీవులు, జనావాసాలు లేని వాయువ్య హవాయి దీవులు మ్యాప్ నుండి తొలగించబడ్డాయి.
అమెరికాకు ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది?
వాస్తవానికి అమెరికాకు 1776 జులై 2నే స్వతంత్రం వచ్చింది. కానీ అందుకు కారణాలను వివరిస్తూ కాంటినెంటల్ కాంగ్రెస్, బ్రిటన్ కింగ్ జార్జ్‌కు లేఖ రాసింది. ఆయన ఆమోదంతో జులై 4న అధికారికంగా స్వాతంత్ర్య ప్రకటన చేశారు.
































