జూలై 23న హైదరాబాద్‌లో జాబ్‌మేళా.. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు

హైదరాబాద్‌లోని మదాపూర్, 100 ఫీట్ రోడ్డులోని శ్రీ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జూలై 23న భారీ ఉద్యోగ మేళా నిర్వహించబడుతోంది.


ఈ మేళా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగనుంది.

నిర్వాహకుడు మన్నన్ ఖాన్ ఇంజనీర్ పత్రికా ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ జాబ్‌మేళాలో అనేక కంపెనీలు పాల్గొని ఫార్మా, హెల్త్, ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు, విద్య, బ్యాంకులు, ఇతర రంగాలలో వివిధ ఉద్యోగ అవకాశాలను అందిస్తాయి.

కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్(Work from Home) అవకాశాలు కూడా అందుబాటులో ఉంటాయి. పదవ తరగతి ఆపైన విద్యార్హత ఉన్నవారు అర్హులు. ప్రాథమిక ఇంటర్వ్యూలు జాబ్‌మేళా వేదిక వద్దనే జరుగుతాయి. ప్రవేశం ఉచితం. ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారు 8374315052 నంబర్‌ను సంప్రదించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.