ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL కూడా వినియోగదారులను ఆకర్షించడానికి ఏ అవకాశాన్ని వదులుకోదు. సరికొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెడుతూ వినియగదారులను ఆకట్టుకుంటోంది.
ఇప్పుడు కంపెనీ తన రూ.197 చౌక ప్లాన్‌లో మార్పులు చేసింది. ఈ ప్లాన్ చెల్లుబాటు, ప్రయోజనాలలో పెద్ద మార్పు కనిపిస్తుంది. ఈ చౌక ప్లాన్ ఎక్కువ చెల్లుబాటును మాత్రమే కాకుండా డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ అన్ని ప్రయోజనాలను కూడా ఇస్తుంది. రూ.200 కంటే తక్కువ ధరలో వచ్చే ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు ఏ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో పెద్ద మార్పు ఏమిటో తెలుసుకుందాం.
కొత్త, పాత ప్రయోజనాలు:
పాత ప్రయోజనాలు: రూ. 197 ప్లాన్ తో మీరు రోజుకు 2 GB హై స్పీడ్ డేటా , అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS పొందేవారు. అలాగే ప్రయోజనాలన్నీ కూడా 15 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్క వ్యాలిడిటీ మాత్రం 70 రోజుల వరకు ఉండేది. తక్కువ ధరకు ఎక్కువ కాలం సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారు ఈ ప్లాన్‌ను ఇష్టపడతారు. కానీ ఇప్పుడు ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉన్న ప్రయోజనాలు మారాయి.
కొత్త ప్రయోజనాలు: ఈ ప్లాన్‌లో మీరు ఇప్పుడు మొత్తం 4 GB డేటా, 100 SMS, 300 నిమిషాల వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను పొందుతారు. కానీ ఈ ప్లాన్ ప్రయోజనాలు 15 రోజులు కాకుండా పూర్తి 54 రోజులు అందుబాటులో ఉంటాయి.
జియో 198 ప్లాన్
198 రూపాయల ప్లాన్ తో మీకు ప్రతిరోజూ 2 GB డేటా, కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలు లభిస్తాయి. కానీ ఈ ప్లాన్ 14 రోజుల చెల్లుబాటును మాత్రమే ఇస్తుంది. ఈ ప్లాన్ తో జియో టీవీ, జియో AI క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనం లభిస్తుంది.
ఎయిర్టెల్ రూ.199 ప్లాన్:
ఎయిర్‌టెల్‌లో మీకు రూ.197 ప్లాన్ కనిపించదు. కానీ కంపెనీ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో 28 రోజుల చెల్లుబాటుతో 2 GB హై స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు మాత్రమే అందిస్తుంది. ఉచిత హెలోట్యూన్ ప్రయోజనం, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, స్పామ్ హెచ్చరికలు వంటి కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
































