JOB News: BDL ట్రైనీ ఇంజినీర్ పోస్టులు భర్తీ

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత డైనమిక్స్ (బీడీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 10.

పోస్టుల సంఖ్య: 212

పోస్టులు: ట్రైనీ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) 50, ట్రైనీ ఇంజినీర్ (మెకానికల్) 30, ట్రైనీ ఇంజినీర్(ఎలక్ట్రికల్) 10, ట్రైనీ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్) 10, ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్) 05, ట్రైనీ ఆఫీసర్ (హ్యూమన్ రీసోర్స్) 04, ట్రైనీ ఆఫీసర్ (బిజినెస్ డెవలమెంట్) 03, ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ (మెకానికల్) 30, ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) 10, ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్) 10, ట్రైనీ అసిస్టెంట్ (ఫైనాన్స్) 05, ట్రైనీ అసిస్టెంట్ (హ్యూమన్ రిసోర్స్) 05.

ఎలిజిబిలిటీ :ట్రైనీ ఇంజినీర్: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్:మెకానికల్, ఆటోమెషన్ అండ్ రొబోటిక్స్, ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, ప్లాంట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి.

ట్రైనీ అసిస్టెంట్( ఫైనాన్స్): కామర్స్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్( ఫైనాన్స్ స్పెషలైజేషన్)లో డిగ్రీతోపాటు కనీసం ఆరు నెలల ఆఫీస్ అప్లికేషన్స్​లో కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్​తోపాటు సీఏ ఇంటర్/ ఐసీడబ్ల్యూఏ ఇంటర్/ సీఎస్ ఇంటర్ లేదా సైన్స్/ ఎకనామిక్స్​తో ఏదైనా డిగ్రీతోపాటు ఫైనాన్షియల్ మేనేజ్​మెంట్​లో ఏడాది డిప్లొమా కోర్సుతోపాటు కనీసం ఆరు నెలల ఆఫీస్ అప్లికేషన్లలో కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.

ట్రైనీ అసిస్టెంట్(హ్యూమన్ రిసోర్స్): బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వెల్ఫేర్, పీఎం అండ్ ఐఆర్, పర్సనల్ మేనేజ్​మెంట్, హెచ్ఆర్, సోషల్ సైన్సెస్​లో డిగ్రీతోపాటు కనీసం ఆరు నెలల ఆఫీస్ అప్లికేషన్స్​లో కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. లేదా ఏదైనా డిగ్రీతోపాటు పీఎం, పీఎం అండ్ ఐఆర్, ఎస్ డబ్ల్యూ, టీ అండ్ డీ, హెచ్ఆర్, లేబర్ లాలో ఏడాది డిప్లొమా కోర్సుతోపాటు కనీసం ఆరు నెలల ఆఫీస్ అప్లికేషన్స్ లో కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.

ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్): కాస్ట్ మేనేజ్​మెంట్ అకౌంటెన్సీ(సీఎంఏ) లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా ఎంబీఏ లేదా ఫైనాన్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ట్రైనీ ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్స్): ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/ హెచ్ఆర్, పీఎం అండ్ ఐఆర్/ పర్సనల్ మేనేజ్​మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ సోషల్ సైన్స్/ సోషల్ వెల్ఫేర్/ సోషల్ వర్క్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

ట్రైనీ ఆఫీసర్(బిజినెస్ డెవలప్​మెంట్): ఎంబీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/ మార్కెటింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు 28 నుంచి 33 ఏండ్లు, ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు 28 నుంచి 33 ఏండ్లు, ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ పోస్టులకు 28 నుంచి 33 ఏండ్లు, ట్రైనీ అసిస్టెంట్ పోస్టులకు 28 నుంచి 33 ఏండ్లు.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తుది ఎంపికలో రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.

శాలరీ: ట్రైనీ ఇంజినీర్/ ట్రైనీ ఆఫీసర్: మొదటి సంవత్సరం ప్రతి నెల రూ.29,500, రెండో సంవత్సరం ప్రతి నెల రూ.32,500, మూడో సంవత్సరం ప్రతి నెల రూ.35,500, నాలుగో సంవత్సరం ప్రతి నెల రూ.38,500.

ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్/ ట్రైనీ అసిస్టెంట్: మొదటి సంవత్సరం ప్రతి నెల రూ.24,500, రెండో సంవత్సరం ప్రతి నెల రూ. 26,000, మూడో సంవత్సరం ప్రతి నెల రూ. 27,500, నాలుగో సంవత్సరం ప్రతి నెల రూ. 29,000.

ఎగ్జామ్ ప్యాటర్న్: కంప్యూటర్ బేస్డ్ టెస్టులో 120 ప్రశ్నలు ఇస్తారు. రెండు గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. సంబంధిత సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు, జనరల్ ఆప్టిట్యూడ్ (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్​) నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్టులో అర్హత సాధించాలంటే 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓబీసీ(నాన్ క్రిమీలేయర్), ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. కనీస అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి మెరిట్ ఆధారంగా1: 7 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: జులై 17.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
లాస్ట్ డేట్: ఆగస్టు 08.
అడ్మిట్​కార్డ్స్ డౌన్​లోడ్:ఆగస్టు 18.
రాత పరీక్ష తేదీ: ఆగస్టు 24.
ఎగ్జామ్ సెంటర్స్: తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్టణంలో.
పూర్తి వివరాలకు bdl-india.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.