పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. ప్రస్తుతం పొందుతున్న పింఛన్‌కు అదనంగా 15 శాతం పింఛన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల నుంచే అమలు చేస్తారని సమాచారం.
ప్రభుత్వ మాజీ ఉద్యోగులు పింఛన్‌లో కీలక మార్పు జరిగింది. 80 ఏళ్ల తర్వాత ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెరుగైన పెన్షన్ ప్రయోజనాన్ని తగ్గించి వయస్సును కుదించింది. ఇకపై 65 ఏళ్ల వయస్సు నుంచి అదనపు పింఛన్ సౌకర్యం లభించనుంది.
అదనపు పింఛన్‌ను అందుబాటులో ఉంచాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ఈ పథకం ఆమోదం పొందిన తర్వాత లక్షలాది మంది పింఛన్‌దారులకు భారీ ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. పదవీ విరమణ పొందిన వృద్ధులకు మరిన్ని ఖర్చులు ఉంటాయి. దీనికితోడు ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉండడంతో ఆర్థిక భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది.
ప్రస్తుతం 80 ఏళ్ల తర్వాత మాత్రమే 20 శాతం అదనపు పెన్షన్ అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త పథకం ప్రకారం ఈ అదనపు పెన్షన్ ప్రయోజనం 65 సంవత్సరాల వయస్సు నుంచి ప్రారంభం కానుంది. ప్రభుత్వ మాజీ ఉద్యోగులకు పార్లమెంటరీ కమిటీ 65 ఏళ్ల తర్వాత అదనపు పెన్షన్‌ను సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు ఆమోదం పొందితే ఇకపై పింఛన్‌దారులకు 65 ఏళ్ల నుంచే అదనపు పెన్షన్ అందుబాటులోకి రానుంది.
కొత్త సిఫారసుల ప్రకారం 65 ఏళ్ల వయసులో 5 శాతం అదనపు పెన్షన్, 70 ఏళ్ల వయసులో 10 శాతం అదనపు పెన్షన్, 75 ఏళ్ల వయసులో 15 శాతం అదనపు పెన్షన్, 80 ఏళ్ల వయసులో 20 శాతం అదనపు పెన్షన్ లభించనుంది.
ఇప్పటికే ఈ నియమాన్ని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఈ నియమాన్ని అమలు చేస్తుండడంతో ఈ సిఫార్సును అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండడంతో తాజాగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరి ఈ సిఫారసులు ఎప్పుడు అమలవుతాయనేది తెలియాల్సి ఉంది.
































