షూటింగ్ సెట్ లో ప్రమాదం.. హీరో, హీరోయిన్‌కు గాయాలు

యంగ్ హీరో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘డెకాయిట్’. షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రిత యార్లగడ్డ నిర్మిస్తున్నారు.


తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా జరుగుతున్న షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగినట్టు సమాచారం. హీరో హీరోయిన్లకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా.. సెట్ లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ సంఘటనలో హీరోహీరోయిన్లు అడవి శేష్, మృణాల్ లకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. దీంతో షూటింగ్ ని నిలిపివేసి వారిని ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. కాగా ఈ ప్రమాదంకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.