గుడ్‌ న్యూస్‌.. పెద్ద క్రాష్‌ రాబోతోంది: రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ రచయిత

రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పర్సనల్‌ ఫైనాన్స్ పుస్తకం ద్వారా ప్రసిద్ధి చెందిన రాబర్ట్ కియోసాకి ఏదో క్రాష్‌ రాబోతోందని హెచ్చరించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ సహా అసెట్ క్లాసుల్లో బుడగలు పేలబోతున్నాయంటూ ఈ 78 ఏళ్ల ఇన్వెస్టర్, ఎంట్రాప్రెన్యూర్ సంకేతాలిచ్చారు.


సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో రాబర్ట్‌ కియోసాకి ఒక పోస్ట్‌ చేశారు. “బుడగలు పేలడం ప్రారంభించాయి.. బుడగలు పేలినప్పుడు బంగారం, వెండి, బిట్ కాయిన్ కూడా పతనమవుతాయి. గుడ్ న్యూస్’ అంటూ రాసుకొచ్చారు.

క్రాష్‌ అంటూ హెచ్చరిస్తున్నప్పటికీ రానున్న పతనాన్ని కొనుగోలు అవకాశంగా కియోసాకి పేర్కొన్నారు. ధరలు పడిపోతే తాను బంగారం, వెండి, బిట్ కాయిన్లలో ఎక్కువ పెట్టుబడి పెడతానని చెప్పుకొచ్చారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్తమ సమయం ధరలు తక్కువగా ఉన్నప్పుడు, భయం ఎక్కువగా ఉన్నప్పుడు అని ఆయన వివరించారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.