ఏపీలో ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు జాబితా.. సీటెక్కడొచ్చిందో చెక్‌ చేసుకోండిలా

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌(APEAPCET 2025) కౌన్సెలింగ్‌ తొలి విడత సీట్ల కేటాయింపు జాబితా విడుదలైంది. తొలి రౌండ్‌ ఫలితాలను ఏపీ ఉన్నత విద్యామండలి అధికారులు బుధవారం విడుదల చేశారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మంగళవారమే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. సీట్ల కేటాయింపు ప్రోగ్రామ్‌ రన్నింగ్‌కు ఎక్కువ సమయం పట్టడంతో బుధవారం విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీట్లకు సంబంధించిన జాబితాను ఈ సాయంత్రం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. (EAPCET Seat Allotment Result)


ఇలా చెక్‌ చేసుకోండి..

  • మొదటి రౌండ్‌లో ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుసుకొనేందుకు విద్యార్థులు https://eapcet-sche.aptonline.in/EAPCET/ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో ఫారమ్స్‌ అనే బాక్సులో ‘డౌన్‌లోడ్‌ అలాట్‌మెంట్‌ ఆర్డర్‌’పై క్లిక్‌ చేయాలి
  • మీ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేయాలి.
  • అలాట్‌మెంట్‌ ఆర్డర్‌, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, వెబ్‌ ఆప్షన్స్‌ రిపోర్టు డిస్‌ప్లే అవుతాయి.
  • అక్కడ మీ అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  • వెరిఫికేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే..

    కాలేజీలో రిపోర్టు చేసేందుకు వెళ్లేటప్పుడు విద్యార్థులు తప్పనిసరిగా ఈ కింద పేర్కొన్న పత్రాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది.

    • ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ స్లిప్పు
    • ఏపీ ఈఏపీసెట్‌ ర్యాంక్‌ కార్డు
    • ఏపీ ఈఏపీసెట్‌ అడ్మిట్‌ కార్డు
    • ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్‌
    • ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు
    • ఆదాయ ధ్రువీకరణపత్రం
    • నివాస, లోకల్‌ స్టేటస్‌ని తెలిపే సర్టిఫికెట్‌ వంటి పలు సర్టిఫికెట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

    సీట్లు పొందిన అభ్యర్థులు జులై 26 లోపు ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 4 నుంచి తరగతులు మొదలవుతాయి. కౌన్సెలింగ్‌లో దాదాపు 1.20 లక్షల మంది బ్రాంచీలు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.