రేపటి నుంచి ఉభయగోదావరి జిల్లాల మధ్య రాకపోకలు బంద్… ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే

శ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని చించినాడ గ్రామం నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం దిండి గ్రామం మధ్య నేషనల్ హైవే-216 (పాత నం.214) పై నిర్మితమైన చించినాడ వంతెన మరమ్మతుల కోసం తాత్కాలికంగా రాకపోకలకు ఆంక్షలు విధించబడ్డాయి.


1995 నుంచి 2001 వరకు ఆర్ అండ్ బి స్పెషల్ డివిజన్, భీమవరం వారిచే నిర్మితమైన ఈ వంతెన ప్రస్తుతం అత్యవసర మరమ్మతుల అవసరంలో ఉందని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో రోడ్డు రవాణా, ఆర్ అండ్ బి, ఆర్టీసీ శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. వంతెనపై మరమ్మత్తులు పూర్తయ్యే వరకు గరిష్ఠంగా గంటకు 30 కిలోమీటర్ల వేగంతో కేవలం లైట్ మోటార్ వెహికల్స్‌ ప్రయాణించడానికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన వాహనాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటుచేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు.

ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా

కత్తిపూడి నుంచి నర్సాపురం/భీమవరం వైపు వెళ్లేవారు

కత్తిపూడి – జగ్గంపేట – రాజమహేంద్రవరం – పాలకొల్లు – నర్సాపురం/భీమవరం మార్గంలో ప్రయాణించాలి.

కాకినాడ నుంచి నర్సాపురం/భీమవరం వైపు

రావులపాలెం – సిద్ధాంతం మార్గంలో వెళ్లాలి

కాకినాడ, రామచంద్రాపురం, మండపేట నుంచి

రావులపాలెం – సిద్ధాంతం – పాలకొల్లు – నర్సాపురం/భీమవరం మార్గంలో వెళ్లాలి.

అమలాపురం నుంచి

కొత్తపేట – రావులపాలెం – సిద్ధాంతం మార్గం ఉపయోగించాలి.

తాటిపాక/రాజోలు నుంచి

తాటిపాక – పి.గన్నవరం – ఈతకోట – సిద్ధాంతం మార్గంలో ప్రయాణించాలి.

యానాం నుంచి

ద్రాక్షారామ – రావులపాలెం – సిద్ధాంతం మార్గంలో పాలకొల్లు – నర్సాపురం/భీమవరం చేరాలి.

నర్సాపురం నుంచి రాజోలు వైపు

భీమవరం – పాలకొల్లు – సిద్ధాంతం – రావులపాలెం మార్గంలో ప్రయాణించాలి.

నర్సాపురం నుంచి రాజోలు బయలుదేరే వారు

దిగమర్రు – పాలకొల్లు – సిద్ధాంతం – రావులపాలెం మార్గం ఎంచుకోవాలి.

ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి: ఆర్టీవో శ్రీనివాసరావు
నేషనల్ హైవే అథారిటీస్ సూచన మేరకు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జూలై 25 నుండి మరమ్మత్తుల కారణంగా’చించినాడ బ్రిడ్జి’ మూసివేస్తున్న కారణంగా చించినాడ బ్రిడ్జి మీదుగా రాకపోకలు కొనసాగించే స్కూల్స్ / కళాశాలల బస్సుల యాజమాన్యం అదేవిధంగా విద్యార్థుల తల్లితండ్రులు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా రాకపోకలు కొనసాగించాలని డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. కాబట్టి స్కూల్స్ / కళాశాలల యాజమాన్యం మరియు విద్యార్థుల తల్లితండ్రులు గమనించి సహకరించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.