రోజుకు 10 వేల అడుగులు గుండె ఆరోగ్యానికి వరం..! అంటే ఎన్ని కిలోమీటర్లో తెలుసా..?

రోజూ 10,000 అడుగులు నడవడం బరువు తగ్గడానికి, బరువు నిర్వహణకు ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరిగి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు వేగంగా తగ్గిపోతుంది.


వాకింగ్‌లో రోజూ 10,000 అడుగులు నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది గుండెను బలపరుస్తుంది. శరీరంలోని రక్తపోటు స్థాయిని నిర్వహించడంలో సహాయపడుతుంది.

ఉదయం లేదా రోజులో ఎప్పుడైనా 10,000 అడుగులు నడవడం వల్ల శరీర శక్తి స్థాయి పెరుగుతుంది. నడక వల్ల శరీరం రోజంతా ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా ఉంటుంది. అందుకే రోజూ 10,000 అడుగులు నడవడం అలవాటు చేసుకోండి. నడక శరీరానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది ఒత్తిడి, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు దృఢంగా ఉండి కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

10000వేల నడక అంటే.. పెద్దవారి స్ట్రైడ్​అడుగు పొడవును బట్టి దాదాపు 64 నుంచి 76.2 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. వీరి నడక సగటు వేగం 2 నుంచి 4 మైళ్లు అంటే.. 3.2 నుంచి 6.4 కిలో మీటర్ల వరకు ఉంటుంది. ఇక, వివిధ ఉపరితలాలను బట్టి వేగం మారుతుంది. అలా 10 వేల అడుగులు నడిస్తే 5 మైళ్లు అంటే 8 కిలో మీటర్లు నడిచినట్లు అవుతుంది. వాకింగ్‌ వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. నడక ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. డయాబెటిక్ రోగులకు వాకింగ్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.