1. తలనొప్పి, ఆకస్మికంగా తల తిరగడం : స్ట్రోక్ రావడానికి ఒక నెల ముందు విపరీతమైన తల నొప్పి వస్తుందంట. ఎలాంటి ఒత్తిడి లేకున్నా, అది సాధారణ తలనొప్పి కంటే ఎక్కువగా ఉంటుంది.
అంతే కాకుండా ఈ రకం తల నొప్పి చాలా భిన్నంగా ఉంటుందంట. అందుకే తీవ్రమైన తలనొప్పిని ఎప్పుడూ విస్మరించకూడదంట. అలాగే ఉన్నట్లుండి ఒక్కసారిగా తల తిరగడం, నడవడంలో ఇబ్బంది వంటి సమస్య ఎదరైతే కూడా అప్రమత్తంగా ఉండాలంట. ఇది రక్త ప్రసరణ బలహీనపడటం వలన స్ట్రోక్‌కు ముందు ఇచ్చే సంకేతం అంట.
2. తిమ్మిరి, బలహీనత : ఎప్పుడూ లేని విధంగా మీ ముఖంలో లేదా కాళ్లు, చేతుల్లో శరీరంలోని ఒక వైపు మాత్రమే అకస్మాత్తుగా జలదరింపు, తిమ్మిరి, బలహీనత వంటి లక్షణాలు కనిపించడం కూడా స్ట్రోక్ లక్షణమేనంట. అందువలన శరీరంలో ఒకవైపు మాత్రమే తిమ్మరి, బలహీనంగా అనిపిస్తే లేదా కండరాల సమస్య వంటివి ఎదురు అవుతే, వాటిని విస్మరించకూడదంట.
3. జ్ఞాపకశక్తి కోల్పోవడం : మతిమరుపు అనేది కామన్. అయితే వయసు పైబడన కొద్ది ఈ సమస్య అధికం అవుతుంది. కానీ 3 ఏళ్లు పై బడిన వారిలో అనుకోని విధంగా మతిమరుపు, గంధరగోళం వంటి సమస్యలు ఎదురవుతే, దానికి ముఖ్య కారణం మెదడుకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అందడం లేదని అర్థం అంట. ఇది స్ట్రోక్‌కు ముఖ్య కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
4. అస్పష్టమైన దృష్టి : స్ట్రోక్ రావడానికి ఒక నెల ముందు దృష్టిలో మార్పులు వస్తాయంట. అస్పష్టంగా కనిపించడం వంటి సమస్యలు వచ్చినట్లైతే ఇది స్ట్రోక్ ముందస్తు హెచ్చరిక అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఈ సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు వైద్యులు.
5. మాట్లాడటంలో ఇబ్బంది, ఇబ్బంది, పదాలు అస్పష్టంగా ఉండటం లేదా సంభాషణలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటం, తాత్కాలికమే అయినా, మెదడుకు రక్త ప్రవాహం తగ్గినప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురు అవుతాయంట. కొన్ని సార్లు ఇది స్ట్రోక్‌కు దారి తీయవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
































