స్టీలు గిన్నెలతో యమ డేంజర్.. ఈ 5 పదార్థాలు అస్సలు పెట్టొద్దు

స్టీల్ పాత్రలు శుభ్రం చేయడం తేలిక. అందుకే వంటింట్లో వీటిని విరివిగా వాడతాం. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు స్టీల్‌తో చర్య జరిపి రుచి, పోషకాలను కోల్పోతాయి.


అసలు స్టీల్ పాత్రల్లో వాడకూడని ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం.

టమాటాలు: టమాటాలతో వండిన ఏ వంటకాలైనా స్టీల్ డబ్బాల్లో ఉంచకపోవడమే మంచిది. టమాటాల్లోని సహజ ఆమ్లాలు స్టీల్‌తో చర్య జరిపి ఆహార రుచిని, పోషకాలను ప్రభావితం చేస్తాయి. వీటి బదులు సిరామిక్ లేదా గాజు పాత్రలలో నిల్వ చేయాలి.

కట్ చేసిన పండ్లు: ముక్కలుగా కోసిన పండ్లు, ఫ్రూట్ సలాడ్‌లను స్టీల్ కంటెయినర్లలో పెట్టడం సరికాదు. ఎక్కువసేపు స్టీల్ పాత్రలో ఉంచితే వాటిలో నీరు చేరి రుచి మారిపోతుంది. అరటిపండ్లు, నారింజ వంటి మెత్తటి పండ్లను గాలి చొరబడని గాజు పాత్రలు లేదా ఫుడ్-సేఫ్టీ ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచితే తాజాగా, రుచిగా ఉంటాయి.

నిమ్మతో తయారైన వంటకాలు: స్టీల్, నిమ్మ (సిట్రస్) ఒక మంచి కాంబినేషన్ కాదు. నిమ్మరసం, ఆమ్‌చూర్ (మామిడి పొడి), చింతపండు వంటి పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలను స్టీల్ డబ్బాల్లో ఎక్కువసేపు నిల్వ చేస్తే వాటి రుచి తగ్గుతుంది. కాబట్టి, వీటిని గాజు లేదా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ పాత్రలలో నిల్వ చేయడం మంచిది.

పెరుగు: పెరుగులో సహజసిద్ధమైన ఆమ్ల గుణాలు ఉంటాయి. దీనిని స్టీల్ కంటెయినర్‌లో ఎక్కువ సమయం ఉంచినప్పుడు రుచి మారుతుంది. పులిసిపోయి, దాని చిక్కదనం (టెక్చర్) కూడా దెబ్బతింటుంది. అందుకే, పెరుగును సిరామిక్ లేదా గాజు పాత్రలలో పెట్టడం ఉత్తమం. పెరుగు జీర్ణవ్యవస్థకు మేలు చేసే ప్రోబయోటిక్ పదార్థం.

పచ్చళ్లు: భారతీయులకు పచ్చళ్లు అంటే చాలా ఇష్టం. పచ్చళ్లను ఎక్కువగా ఉప్పు, నూనె, పులుపు (నిమ్మరసం, వెనిగర్, చింతపండు) కలిపి తయారుచేస్తారు. ఈ ఆమ్ల గుణాలు మెటల్‌తో చర్య జరిపే అవకాశం ఉంది. ముఖ్యంగా, మంచి నాణ్యత లేని స్టీల్ అయితే ఈ సమస్య మరింత పెరుగుతుంది. దీనివల్ల పచ్చళ్ల రుచి మారిపోయి, ఓ రకమైన మెటాలిక్ రుచి వస్తుంది. అంతేకాకుండా, పచ్చళ్లు త్వరగా పాడవుతాయి. అందుకే, పచ్చళ్లను స్టీల్ జాడీల్లో అస్సలు నిల్వ చేయొద్దు. వాటికి బదులు గాజు సీసాలను ఉపయోగించండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.