ఆపిల్ కొత్త ఐఫోన్ 16e మరి ఇంత తక్కువా? అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

ఆపిల్ ఐఫోన్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్.. కొత్త ఐఫోన్ కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్.. ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఐఫోన్ 16eపై భారీ (Apple iPhone 16e) డిస్కౌంట్ అందిస్తోంది.


ఐఫోన్ 16e కొనుగోలుపై ఏకంగా రూ. 10,300 వరకు తగ్గింపు పొందవచ్చు. మీ ప్రస్తుత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 16e ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..

అమెజాన్‌లో ఐఫోన్ 16e డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ రూ.59,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ రూ.6,300 ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది. దాంతో అసలు ధర నుంచి రూ.53,600కి తగ్గింది. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ధర తగ్గాలంటే పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ 6.1-అంగుళాల OLED ప్యానెల్‌తో 60Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. హుడ్ కింద A18 చిప్‌సెట్‌తో వస్తుంది. ఫేస్ ఐడీ, IP68 సర్టిఫికేషన్‌తో అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఇంకా, ఐఫోన్ 16e మోడల్ 8GB ర్యామ్‌తో వస్తుంది.

ఇమేజ్ ప్లేగ్రౌండ్, జెన్మోజీ, చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్, రైటింగ్ అసిస్టెంట్ టూల్స్ వంటి ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. ఫొటోగ్రఫీ కోసం ఐఫోన్ 16e ఫోన్‌లో 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.