నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం(AP Govt). ఏపీ ఆయుష్(Ayush) విభాగంలో పలు పోస్టులకు నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆయుష్ లో మొత్తం 358 పోస్టుల భర్తీకి(Job Notification) ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి సత్య కుమార్ ప్రకటించారు. ఈ పోస్టుల్లో 71 మంది డాక్టర్లు, 26 మంది జిల్లా ప్రోగ్రాం మేనేజర్లు, 90 మంది పంచకర్మ థెరపిస్టులు, మిగిలిన పోస్టులలో సహాయకులను నియమించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఏపీలో ఆయుష్ సేవల విస్తరణను దృష్టిలో పెట్టుకొని సత్వరమే ఈ నియామకాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం ఆయుష్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఐదేళ్లలో కేవలం రూ.37 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని మంత్రి సత్య కుమార్ ఫైర్ అయ్యారు.
































