ప్రస్తుత కాలంలో బ్యాంకు వ్యవహారం జరిపే వారికి క్రెడిట్ కార్డు తప్పనిసరిగా ఉంటుంది. కొందరికి అయితే ఒకడికి మించి క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి.
అవసరానికి అప్పు ఇచ్చే వ్యక్తిగా ఇవి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు అందిస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డును కొందరు మిస్ యూస్ చేసుకుంటూ అప్పుల పాలవుతున్నారు. దీనిని క్రమ పద్ధతిలో వాడుకోవడం వల్ల అనేక రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే క్రెడిట్ కార్డుల విషయంలో ఎప్పటికప్పుడు నిబంధనలు మారుతూ ఉంటాయి. తాజాగా జూలై 1 నుంచి క్రెడిట్ కార్డు వాడకంలో మార్పులు రానున్నాయి. ముఖ్యంగా HDFC క్రెడిట్ కార్డు వాడేవారు ఇకనుంచి అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అవి ఎలా అంటే?
క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత చాలామంది ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తూ.. బిల్లులు చెల్లిస్తున్నారు. క్రెడిట్ కార్డులో కొంతవరకు ముందస్తుగా నగదు నిల్వ ఉండడంతో దీనిని వాడుతూ ఉంటారు. ఆ తర్వాత నగదు వచ్చినంక బిల్లులు చెల్లిస్తూ ఉంటారు. దీంతో ముందస్తు డబ్బు వాడుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటివరకు క్రెడిట్ కార్డు ద్వారా ఎటువంటి బిల్లును అయినా లిమిట్ లేకుండా చెల్లించుకునే అవకాశం ఉండేది. కానీ జూలై 1 నుంచి కొత్త నిబంధనలు వచ్చాయి.
క్రెడిట్ కార్డు నుంచి చాలామంది పెట్రోల్ పోయించుకుంటారు. క్రెడిట్ కార్డ్ ద్వారా పెట్రోల్ కొనుగోలు చేస్తే ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు. అయితే HDFC బ్యాంకు మాత్రం క్రెడిట్ కార్డు ఉన్నవారికి పెట్రోల్ కొనుగోలు చేయడానికి లిమిట్ విధించింది. అంటే ఈ కార్డు ద్వారా రూ. 10000 వరకు పెట్రోల్ కొనుగోలు చేయొచ్చు. అప్పటివరకు ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు. కానీ ఈ లిమిట్ దాటితే ఆ మొత్తం పై చార్జీలతోపాటు జీఎస్టీ ని కూడా విధించే అవకాశం ఉంది. ఉదాహరణకు రూ. 12,000 పెట్రోల్ కొనుగోలు చేస్తే అదనంగా ఉన్న రూ. 2,000 పై చార్జీలు వేసి అవకాశముంది. అందువల్ల ఇకనుంచి ఈ కార్డు ఉన్నవారు నిబంధనలకు లోబడి యూస్ చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే క్రెడిట్ కార్డు ద్వారా కొందరు కరెంటు బిల్లులు చెల్లిస్తూ ఉంటారు. గృహ అవసరాలతో పాటు కొన్ని సంస్థలు కంపెనీలు యూపీఐ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం కన్వీనియన్స్ ఫీ తో తక్కువ మొత్తంలో చార్జ్ పడుతుంది. కానీ జూలై 1 నుంచి లిమిట్ దాటితే సర్వీస్ ఛార్జ్‌ను అదనంగా వేస్తున్నారు. అంటే కరెంటు బిల్లులు రూ, 50,000 వరకు చెల్లిస్తే ఎలాంటి చార్జీలు ఉండవు. కానీ ఆ పైన చార్జీలతోపాటు జీఎస్టీ పడే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకు 60,000 బిల్లు చెల్లిస్తే అదనంగా ఉన్న రూట్ 10,000 పై చార్జీలతో పాటు జీఎస్టీ విధిస్తారు.
ఇవే కాకుండా స్కూల్ ఫీజు చెల్లించేవారు థర్డ్ పార్టీ యాప్ ద్వారా బిల్లులు చెల్లించే వారికి సైతం ఇలా అదనపు చార్జీలు పడే అవకాశం ఉంది. అందువల్ల క్రెడిట్ కార్డు ఉన్నవారు ఈ ఈ విషయాన్ని గమనించాలని బ్యాంకు అధికారులు తెలుపుతున్నారు.
































