మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ తనయుడు కిరీటి ఇటీవలే `జూనియర్` సినిమాతో లాంచ్ అయిన సంగతి తెలి సిందే. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలందుకున్నాడు.
నటుడిగా పాస్ అయ్యాడు. డాన్సులతో ఇరగ దీసాడు. మేకింగ్ వీడియోలతో కిరీటీ కష్టం బయట పడింది. సినిమాలంటే ఎంత ఫ్యాషన్ గా ఉన్నా డు? అన్నది మేకింగ్ వీడియోలతోనే ప్రూవ్ అయింది. నటుడిగా మరింత మెరుగు పడాలి. కంటెంట్ ఉన్న సినిమాలు పడితే స్టార్ అవ్వడం కిరీటికి పెద్ద కష్టమేమి కాదు.
డెబ్యూ తోనే ప్రేక్షకుల్లో పర్వాలేదనపించాడు. ఈనేపథ్యంలో కిరీటి తర్వాత స్టెప్ ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరం. రెండవ సినిమా ఏ డైరెక్టర్ తో చేస్తాడు? ఎలాంటి కంటెంట్ తో వస్తాడు? అన్నది చూడాలి. నటు డిగా కొనసాగే అవకాశాలు కిరీటిలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. అతడిలో కష్టపడే తత్వం ఉంది. `జూనియర్` యాక్షన్ సన్నివేశాల కోసం ఎలాంటి డూప్ …రోప్ లేకుండానే నటించాడు. నటుడికి ఇదంత ఈజీ కాదు. ఎంతో రిస్క్ తో కూడుకున్న పనే. ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప చేయలేని పనిని సాధ్యం చేసి చూపించాడు.
ఆర్దికంగా కిరీటి స్ట్రాంగ్. అందులో ఎలాంటి డౌట్ లేదు. అవసరమైతే తానే నిర్మాతగా మారిపోతాడు. అంత టి సమర్దవంతుడు..సత్తా ఉన్నవాడు. తనయుడి కోసం జనార్ధన్ కూడా ఎంతైనా ఖర్చు చేసే అవకాశం ఉన్నవారు. కాబట్టి కిరీటీ చేయాల్సిందల్లా? మంచి దర్శకుడిని వెతికి పట్టుకోవడమే. సరైన కథ మేకర్ దొరికితే కిరీటి వేగంగా షైన్ అవుతాడు. బ్యాకెండ్ లో వారాహీ బ్యానర్ ఎలాగూ ఉంది. రాజమౌళి సహకారం కూడా ఉంటుంది. జూనియర్ సినిమాకు పాన్ ఇండియా సంచలనం రాజమౌళి గెస్ట్ గా రావడం చాలా వరకూ కలిసొచ్చింది.
సినిమాకు కోట్ల రూపాయల పబ్లిసిటీ దక్కింది. కన్నడ, తెలుగు కనెక్షన్ ఉన్న నటుడు. బళ్లారి వాస్తవ్యుడు. కాబట్టి రెండు భాషల్లోనూ కిరీటికి కలిసొస్తుంది. టాలీవుడ్ లో కాంపిటీషన్ టఫ్ గా ఉన్నా? కష్టపడే స్వభావం ఉన్న వాడు కాబట్టి సక్సెస్ కి అవకాశం ఉంది. కన్నడ పరిశ్రమ కూడా ఇప్పుడు పాన్ ఇండియాని ఏల్తోంది. అక్కడ సక్సెస్ అయినా కిరీటికి మంచి భవిష్యత్ ఉంటుంది.
































