ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సెల్ఫ్ ఫైనాన్సింగ్, యాజమాన్య బి1, బి2, ఎన్నారై కోటా సీటల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధికారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు..
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సెల్ఫ్ ఫైనాన్సింగ్, యాజమాన్య బి1, బి2, ఎన్నారై కోటా సీటల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధికారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జులై 25వ తేదీన విడుదల చేశారు. నీట్ యూజీ ప్రవేశలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు జులై 28వ తేదీ ఉదయం 9 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని అందులో వెల్లడించారు. ఆగస్టు రెండో తేదీ రాత్రి 9 గంటల్లోపు దరఖాస్తులను పూరించి, సంబంధిత సర్టిఫికెట్లను వర్సిటీలో సమర్పించాలని పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తులను జులై 23 నుంచి స్వీకరిస్తుంది. జులై 29న రాత్రి 9 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకొని పూరించి పంపాలని సూచించింది. జులై 30వ తేదీ ఉదయం 7 నుంచి జులై 31న రాత్రి 9 గంటల వరకు రూ.20 వేలు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లు స్థానికంగా చదివిన వారు మాత్రమే లోకల్ క్యాటగిరీ కిందకు వస్తారని, ఆ అభ్యర్థులకు మాత్రమే లోకల్ కోటా కింద సీట్లు కేటాయిస్తామని ఇప్పటికే వర్సిటీ స్పష్టం చేసింది.
జులై 31న తెలంగాణ ఎస్సీ గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లు
తెలంగాణ ఎస్సీ గురుకులాల్లో మిగిలిపోయిన సీట్లకు జులై 31వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి ఓ ప్రటనలో తెలిపారు. ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల్లో 19,680 సీట్లకు గానూ ఇప్పటి వరకూ 17,100 సీట్లు భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. సీవోఈ సీట్లల్లో మొత్తం 1,560 సీట్లు ఉండగా.. వీటిల్లో 1,420 సీట్లు భర్తీ చేశామని ఆమె తెలిపారు.
































