3000 సంవత్సరాల క్రితమే మీ పేరు, వివరాలు, జాతకం మొత్తం ఇక్కడ రాసిపెట్టారు…తెలుసుకోవాలంటే మాత్రం ఈ వూరు వెళ్లాల్సిందే…

మానవుడికి ఎప్పుడూ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే బెంగ ఉంటుంది. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం సాధ్యం కాదు అని తార్కికంగా ఆలోచించే కొందరున్నా, మరి కొందరు దాన్ని తెలుసుకోవడాన్కి ప్రయత్నిస్తూ ఉంటారు.


దానికి వారు ఆశ్రయించే ఒకే ఒక మార్గం జ్యోతిష్యం. ఇందులో అనేక విధానాలు ఉన్నా ఎక్కువమంది నమ్మేది మన వేద జ్యోతిష్యాన్నే. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. అయితే దీనికోసం పుట్టిన తేదీ, అలాగే టైం ఖచ్చితంగా ఉండాలి. అది లేనట్టయితే ఫలితాలు తెలుసుకోవడం కష్టం అవుతుంది. మరి వారికి ఏదైనా మార్గం ఉందా అంటే సమాధానం నాడీ జ్యోతిష్యం. ఏంటి నాడి జ్యోతిష్యం దాని ప్రత్యేకత ఏంటి అనే విషయాలు మీ కోసం…

ఈ మధ్య ఎక్కడ చూసిన నాడి జ్యోతిష్యం చెప్పబడును అని ప్రకటనలు కనిపిస్తున్నాయి. అవి అన్నీ నిజమైనవేనా అంటే కాకపోవచ్చు అని చెప్పాలి. నిజమైన నాడి జ్యోతిష్యం చెప్పేవారు తమిళనాడులో వైదీశ్వరన్ కోయిల్ ప్రాంతాల్లో ఉంటారు. అసలు ఏంటి కోయిల్ అంటే శివుడి గుడి. కుంభకోణం కు 57 కిలోమీటర్ల దూరంలో ఆ గుడి ఉంది. ఆ గుడి ప్రాంతంలో ఈ జ్యోతిష్యం చెప్పే కుటుంబాలు అనేకం ఉన్నాయి. అసలు నాడి జాతకం పుట్టింది తమిళనాడులోనే. అతి ప్రాచీన జ్యోతిష్య విధానము ఇది. ప్రపంచం నలుమూలలనుండి ఇక్కడ జాతకం చెప్పించుకోవడం కోసం వస్తారు. తాళపత్ర గ్రంధాల ఆధారంగా ఈ జాతకాన్ని చెప్తారు.

అసలు ఈ జాతకాన్ని చెప్పే విధానం రెగ్యులర్ గా జాతకం చెప్పే విధానానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ జాతకం చెప్పటానికి వీరు మగవారికి కుడి చేతి బొటనవేలి ముద్రను, స్త్రీలకు ఎడమ చేతి బొటనవేలి ముద్రను తీసుకుంటారు. తరువాత మీకు సరిపోలే తాళపత్రం కోసం వెతుకులాట మొదలుపెడతారు. మీ తాళపత్రం దొరికేవరకు వెతుకుతారు. దొరకనట్టయితే ఎదో ఒకటి నోటికొచ్చిన జాతకం చెప్పి పంపరు. దొరకలేదు కాబట్టి ఈ నాడి జ్యోస్యం చెప్పే వేరే వారి దగ్గరకు పంపిస్తారు. ఈ నాడి చెప్పే కుటుంబాలు వైదీశ్వరన్ కోయిల్ లో దాదాపు 50 వరకు ఉంటాయి. అక్కడ కూడా దొరకలేదు అంటే, వెతకటానికి సమయం పడుతుంది మళ్ళీ కొన్ని నెలల తరువాత రమ్మని చెప్తారు. ఇందువల్ల వీరు చెప్పేది నిజం అని చాలా మంది విశ్వసిస్తారు.

ఒకవేళ మీకు సరిపోయే తాళపత్రం దొరికినట్టయితే మీ పేరు తల్లి తండ్రుల పేర్లు వారే చెప్తారు. తరువాత మీ పుట్టినతేది కూడా చెప్తారు. అవి సరిపోతే అక్కడినుండి మీ జాతకాన్ని చెప్తారు. అయితే భవిషత్తు గురించి పూర్తిగా చెప్పకుండా కేవలం సూచనలు మాత్రమే చెప్తారు. మొత్తం 16 ఖాండాలుగా చెప్తారు. ఉదాహరణకి వివాహం, కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక స్థితి, అదృష్టం, సోదర సోదరీమణుల మధ్య సంబంధాలు వంటి విషయాలు తో పాటు మీ జీవితం లో జరిగే అన్ని విషయాలు తెలుపుతారు. పరిహారాలు కూడా చెప్తారు. అలాగే పూర్వజన్మను కూడా తెలుసుకోవచ్చు. పూర్వఖాండం అని దీనిని చెప్తారు. అనేకమంది ఇక్కడ జాతకం చెప్పించుకున్నవారు నిజంగానే వారికి 100 శాతం సరిపోయింది అని అంటూ ఉంటారు. మీ వివరాలు ఏమి పేరుతో సహా మీరు చెప్పకుండా వారే చెప్పటం ఈ నాడి జ్యోస్యం లో నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయం.

నాడి జాతకం పుట్టు పూర్వోత్తరాలు:

ఈ నాడి జ్యోస్యం అగస్త్యుడి పేరు మీద చెప్తారు. ఎందుకంటే దీనికి మూలపురుషుడు అగస్త్య మహాముని.అయితే మొత్తం 18 ఋషులు ఈ నాడి జ్యోతిష్యం రాసారు. అయితే ఎవరు అయినా కూడా మూలపురుషుడైన అగస్త్యుడి పేరుమీద ఈ జాతకాన్ని చెప్తారు. దాదాపు 3000 సంవత్సరాల చరిత్ర ఈ నాడి జ్యోస్యానికి ఉంది. అయితే ఇది భృగు, నారద, శివ ఇలా ఇంకా అనేక పేర్లు మీద కూడా చెప్పబడుతుంది. ఈ మధ్య హైదరాబాద్ లో కూడా కొంతమంది ఈ నాడి జ్యోతిష్యకేంద్రాలను ప్రారంభించారు. వారు కూడా తమిళనాడు కు చెందిన అసలైన కుటుంబాలవారిమే అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. అయితే ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటే మంచిది.

భారతదేశం వేదాలకు పుట్టినిల్లు .నాడీ జ్యోతిష్యం అనేది ఒక విశేషమైన భారతీయ ఆధ్యాత్మిక సంపద. ఇది శాస్త్రం, భక్తి, అంతర్గత విశ్వాసం సమ్మిళితంగా పనిచేసే విధానం. ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం రాసిపెట్టిన తాళపత్రాల్లో మీ వివరాలు, మీ భవిష్యత్తు మీ పేర్లతో రాసి పెట్టి ఉండటం గొప్ప విషయం కదా… మీకు జాతకం పై నమ్మకముండి, పుట్టినసమయం లేనట్టయితే ఒకసారి ప్రయత్నించి చూడండి.

(గమనిక – ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , ఊహల ఆధారంగా ఉంది. సంబంధిత రంగాలలో నిపుణుల నుండి సలహాలు , మార్గదర్శకత్వం పొందడం అవసరం)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.