నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఈ ఏడాది చివరి నుండి అకౌంట్లలోకి రూ.3వేలు

నిరుద్యోగ భృతిపై గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది చివరి నుండి నిరుద్యోగ భృతి పథకం అమలులోకి వస్తుందని అన్నారు.


డిగ్రీ పూర్తి చేసి రెండేళ్లలోపు ఉద్యోగం రాకుండా నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంటర్ వరకు మాత్రమే చదివిన వాళ్లకు డబ్బులు రావని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అశోక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత నిరుధ్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.