ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.2లక్షలు ఇస్తారు, నెలకు రూ.30 వేల ఆదాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్ధిక సాధికారత కోసం నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. “డిజిలక్ష్మి కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీలు)” పేరుతో ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం కలగనుంది.


డిజిటల్ సేవలను అందిస్తూ నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.

మహిళలకోసం ప్రత్యేకంగా డిజిలక్ష్మి కేంద్రాలు

పట్టణాల్లోని పేదవర్గాల మహిళల కోసం ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్లలో “మీ సేవా” సేవలు, ఆధార్, బ్యాంకింగ్, బిల్లులు, ప్రభుత్వ పథకాల సేవలు వంటి 236 రకాల డిజిటల్ సేవలు అందించనున్నారు. డ్వాక్రా గ్రూపులో సభ్యత్వం కలిగిన, 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సున్న వివాహిత మహిళలు ఈ పథకానికి అర్హులు.

రూ.2 లక్షల రుణం, ముగ్గురికి ఉద్యోగ అవకాశాలు

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన ప్రతి మహిళకు రూ.2 లక్షల రుణాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈ రుణంతో కంప్యూటర్, కియోస్క్, అవసరమైన పరికరాలు కొనుగోలు చేసుకొని సెంటర్ నిర్వహించవచ్చు. మిగిలిన మొత్తాన్ని వ్యాపారానికి వినియోగించుకోవచ్చని సూచిస్తున్నారు. ఒక్కొక్క కేంద్రంలో కనీసం ముగ్గురు మహిళలకు ఉద్యోగావకాశం లభించనుంది.

పట్టణ ప్రాంత మహిళలకు మరింత ఉపశమనం

పట్టణాల్లోని ఎస్‌ఎల్‌ఎఫ్‌ల (Slum Level Federations) ద్వారా డిగ్రీ చదివిన మహిళలకు ఈ సెంటర్లలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఒక్కో ఎస్‌ఎల్‌ఎఫ్‌లో 25 స్వయం సహాయక సంఘాలు ఉండగా, ఒక్కో సంఘంలో సుమారు 250 మంది వరకు సభ్యులుండగలుగుతారు.

మెప్మా – ఈ-గవర్నెన్స్ ఒప్పందంతో ముందుకు

ఈ డిజిలక్ష్మి పథకం అమలు కోసం మెప్మా (MEPMA) సంస్థ, ఈ-గవర్నెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే మహిళలకు శిక్షణ కూడా ప్రారంభమైంది. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.