ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్-విజయవాడ రూట్‌లో ప్రయాణించేవారికి బస్సు టికెట్‌ల ధరల్లో 16 – 30 శాతం మధ్య డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.
ఈ డిస్కౌంట్లు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు కడా వర్తిస్తాయని టీజీఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులు టికెట్లను https://tgsrtcbus.inలో బుక్ చేసుకోవచ్చు.
ఈ బస్సుల్లో ప్రయాణిస్తే ఆఫర్లు
- గరుడ ప్లస్ బస్సుల్లో టికెట్ ధరపై 30 శాతం
- ఈ-గరుడ బస్సుల్లో 26 శాతం ఆఫర్
- సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్సుల్లో 20 శాతం
- రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో టికెట్లపై 16 శాతం
































