నెల జీతం రూ.70 వేలు.. ELEVEN స్పెల్లింగ్ కూడా రాని టీచర్

నెలకు రూ.70 వేలు తీసుకుంటున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునికి ELEVEN స్పెల్లింగ్ కూడా రాయడం రాకపోవడంతో అధికారులు షాక్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ అధికారులు తనిఖీలు జరిపారు. తీవ్ర చర్చకు దారితీసింది. ఈ తనిఖీల్లో సురేంద్ర దీక్షిత్ అనే ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు “ELEVEN” అనే పదాన్ని సరిగ్గా రాయలేకపోయాడు. నెలకు రూ.70 వేలు తీసుకుంటూ… 11, 12వ తరగతులకు బోధిస్తున్న ఈ సీనియర్ ఉపాధ్యాయుడు “ELEVEN” స్పెల్లింగ్‌ను “ALAVEN”గా తప్పుగా రాశాడు.

విద్యార్థులను పరీక్షిద్దామని వచ్చిన అధికారులకు ఉపాధ్యాయునికే సరిగా చదువు రాకపోవడంతో ఖంగుతిన్నారు. అయితే ఈ ఘటనను అక్కడున్న విద్యార్థులు సీక్రెట్ గా

తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. బలరాంపూర్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.