ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం… జిల్లాల నిబంధన లేదు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు కానుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఒకటి.దీనిపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన తరువాత ఈ పథకం అమలుకు ఆగస్టు 15 ముహూర్తంగా నిర్ణయించారు.


ఇప్పటికే ఈ పథకాన్ని తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకం అమలుపై ఆయా రాష్ట్రాలలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. దీంతో అన్ని రకాలుగా ఆలోచించి చివరకు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఏ జిల్లా వారికి ఆ జిల్లాలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. అయితే తాజాగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం పథకానికి జిల్లాల పరిమితులేమీ లేవనీ, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చనీ అచ్చెన్నాయుడు చెప్పారు.

ఇటీవల సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ఆయనీ విషయం తెలిపారు. ఏపీలో మహిళలకు ఎగిరి గంతేసే వార్త. మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం రాష్ట్రమంతటా అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.

ఈ పథకానికి జిల్లాల పరిమితులు లేవనీ . రాష్ట్రమంతటా అమలు చేస్తామని తెలిపారు. ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ప్రత్తిపాడులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయనీ ప్రకటన చేశారు.

ఉచిత బస్సు ప్రయాణం ఆటో డ్రైవర్ల ఉపాధిపై ప్రభావం చూపకూడదన్న ఉద్దేశంతో ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. తొలుత జిల్లా పరిధిలోనే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని భావించినప్పటికీ.. ఆ తరువాత మంత్రి నారా లోకేష్ జోక్యంతో దీనిపై విస్తృతంగా చర్చింది, జిల్లాల పరిమితి వద్దని నిర్ణయించినట్లు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.