వినియోగదారులకు అలర్ట్‌.. ఆగస్ట్‌ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు

ఆగస్ట్ నెలలోని అన్ని ఆదివారాలు వారాంతపు సెలవులు ఉన్నాయి. ప్రాంతీయ, స్థానిక అవసరాల కారణంగా భారతదేశంలోని రాష్ట్రాల వారీగా సెలవులు మారవచ్చని మీరు గమనించాలి. మీరు ఎక్కువగా బ్యాంకు పనుల నిమిత్తం వెళ్తున్నట్లయితే బ్యాంకుల సెలవుల జాబితాను..

జూలై నెల ముగియబోతోంది. ఆగస్టు 2025కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు సెలవులను జారీ చేస్తుంటుంది. మొత్తం మీద ఈ నెలలో స్వాతంత్ర్య దినోత్సవం, గణేష్ చతుర్థి, జన్మాష్టమి, ఇతర ప్రాంతీయ వేడుకలు, శని, ఆదివారపు సెలవులతో సహా మొత్తం 15 హాలిడేస్‌ రానున్నాయి. భారతదేశంలోని అన్ని బ్యాంకులు , ప్రభుత్వ, ప్రైవేట్, రెండవ, నాల్గవ శనివారాలను సెలవు దినంగా పరిగణిస్తాయి. నెలలోని అన్ని ఆదివారాలు వారాంతపు సెలవులు ఉన్నాయి. ప్రాంతీయ, స్థానిక అవసరాల కారణంగా భారతదేశంలోని రాష్ట్రాల వారీగా సెలవులు మారవచ్చని మీరు గమనించాలి. మీరు ఎక్కువగా బ్యాంకు పనుల నిమిత్తం వెళ్తున్నట్లయితే బ్యాంకుల సెలవుల జాబితాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ సెలవులన్ని కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రామలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి.


ఆగస్టు, 2025 నెలలో బ్యాంక్ సెలవుల జాబితా

    1. ఆగస్టు 3వ తేదీ ఆదివారం: దేశ వ్యాప్తంగా సాధారణ సెలవు ఉంటుంది.
    2. ఆగస్టు 8 శుక్రవారం: సిక్కిం, ఒడిశా ప్రాంతాల్లో సెలవు (గిరిజన పండుగ.. టెండాంగ్‌లో రమ్ ఫండ్)
    3. ఆగస్టు 9, శనివారం: రెండో శనివారం సాధారణ సెలవు, అలాగే రక్షా బంధన్ పండుగ
    4. ఆగస్టు 10, ఆదివారం: దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
    5. ఆగస్టు 13, బుధవారం: మణిపూర్‌లో రాష్ట్ర స్థాయి పండుగ (దేశ భక్తి దివస్)
    6. ఆగస్టు 15, శుక్రవారం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు
    7. ఆగస్టు 16, శనివారం: జన్మాష్టమి, ఇంకా పార్సీ నూతన సంవత్సర సెలవు
    8. ఆగస్టు 17, ఆదివారం: సాధారణ సెలవు
    9. ఆగస్టు 19, మంగళవారం: త్రిపురలో సెలవు (మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జన్మదినం)
    10. ఆగస్టు 23, శనివారం: నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
    11. ఆగస్టు 24, ఆదివారం: దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
    12. ఆగస్టు 25, సోమవారం: అసోంలో బ్యాంకులకు సెలవు (శ్రీమంత శంకరదేవుని తిరుభావ తిథి)
    13. ఆగస్టు 27, బుధవారం: గణేష్ చతుర్థి సందర్భంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, గోవా, తమిళనాడు, మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు
    14. ఆగస్టు 28, గురువారం: నువాఖై, గణేష్ చతుర్థి సందర్భంగా గోవా, ఒడిశా ప్రాంతాల్లో సెలవు
    15. ఆగస్టు 31, ఆదివారం: సాధారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.