కృత్రిమ మేధ (Artificial Intelligence – AI) టెక్నాలజీ ఇప్పుడు ఉద్యోగ మార్కెట్‌ను అనేక కుదుపులకు గురి చేస్తోంది. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ఎక్స్ గ్రోక్ వంటి టూల్స్ రాకతో ప్రపంచవ్యాప్తంగా జాబ్స్ మార్కెట్ షేక్ కు గురి అవుతోంది.
ఎన్నో రంగాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమవుతున్న ఎఐ అదే స్థాయిలో ఉద్యోగులను కూడా రోడ్డు మీదకు సాగనంపుతోంది. డేటా ప్రాసెసింగ్, కస్టమర్ సపోర్ట్, కంటెంట్ క్రియేషన్ వంటి ఉద్యోగాల్లో ఏఐ వాడకం భారీగా పెరుగుతోంది. దీంతో ఆ ఉద్యోగాలు డేంజర్ జోన్ లోకి వెళ్లాయి.
ఏఐ రాకతో వచ్చిన మార్పులు ఉద్యోగాల్లో భద్రతను ప్రమాదంలో పడేశాయి. ఇటీవలే దేశం లోనే అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సుమారు 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రాసెసింగ్ సామర్థ్యాలు పెరిగడంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎఐ రాకతో మనుషుల అవసరం తక్కువవుతోందని టీసీఎస్ స్పష్టం చేసింది.ఈ పరిణామాలతో ఉద్యోగుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. రేపు నా ఉద్యోగం ఉంటుందా.?ఊడుతుందా.. అనే అనుమానంతో చాలామంది భయపడుతూ ఉద్యోగాలు చేస్తున్నారు.
తాజాగా ఓపెన్‌ఏఐ ChatGPT వ్యవస్థాపకుడు, CEO సామ్ ఆల్ట్‌మన్ కూడా AI వల్ల ఉద్యోగాలు పోతాయనేదానిపై సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. AI వల్ల ఉద్యోగాలు పోతాయి అనడం కరెక్ట్ కాదు.. కొత్త ఉద్యోగాలను కూడా ఇది సృష్టించగలదు. మనం కొత్త స్కిల్స్ నేర్చుకుంటే దానికి అనుగుణంగా ఉద్యోగాలు ఉంటాయని తెలిపారు. ఈ టెక్నాలజీ మనకు అండగా ఉంటుందని తెలిపారు.
ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ చేసిన తాజా అధ్యయనం చాలా మందిలో ఆందోళన రేకెత్తిస్తోంది. మైక్రోసాఫ్ట్ AI అప్లికబిలిటీ స్కోర్ ఆధారంగా ఏ ఉద్యోగాలు AI వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నాయో, ఏవీ కావో అనే విషయం తేల్చి చెప్పింది.
AI ద్వారా కోల్పోయే అయిదు ఉద్యోగాలు ఇవే..
1. అనువాదకులు, వ్యాఖ్యాతలు..
2. రచయితలు, స్క్రిప్ట్ రైటర్లు.
3. సేల్స్ ప్రతినిధులు
4. కస్టమర్ సర్వీస్
5. ఫ్రూప్ రీడింగ్ ఎడిటర్లు
ఏఐ వచ్చినా సురక్షితమైన ఉద్యోగాలు ఇవే..
1. నర్సులు, హెల్త్ అసిస్టెంట్లు, సర్జన్లు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్
2. పైకప్పులు వేసే కార్మికులు
3. ట్రక్ డ్రైవర్లు, మెషిన్ ఆపరేటర్లు
4. మసాజ్ థెరపిస్టులు, రేడియోలాజీ టెక్నీషియన్లు
5. సైంటిస్టులు, లాయర్లు, టీచర్లు
6. స్ట్రాటజిస్టులు, అనలిస్టులు
7. ప్రొఫెషనల్ అథ్లెట్లు
వీటిలో AI ఉపయోగం ఉన్నప్పటికీ అది పని చేయాలని చెప్పగలదు కానీ, చేతులతో చేయలేదు కాబట్టి ఈ ఉద్యోగాలు చాలా సేఫ్ జోన్ లో ఉంటాయి. కళాకారుల రంగంలో పని చేసేవాళ్లకు సైతం ఏఐ వల్ల ఎలాంటి సమస్య ఉండదని చెప్పవచ్చు. వంటలకు సంబంధించి ఉద్యోగాలు చేసేవాళ్లకు, హోటల్ రంగంలో ఉండేవాళ్లకు సైతం ఏఐ వల్ల ఎలాంటి నష్టం ఉండదు.అలాగే ఎలక్ట్రికల్ వర్కర్లు, ప్లంబర్, ఇతర చేతి వృత్తుల పనులు చేసేవాళ్లు సైతం AI వల్ల ఇబ్బందులు పడే ఛాన్స్ ఉండదు. ఈ ఉద్యోగాలలో కొనసాగేవాళ్లకు భవిష్యత్తులో AI వల్ల ఎటువంటి ముప్పు ఉండదు.
ఏఐతో జీతం, విద్యపై ప్రభావం ఎంత ఉంటుంది : ఈ అధ్యయనం సూచించిన మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. AI ప్రభావం వేతనంపై ఎక్కువగా ఉండదు. మధ్య స్థాయి ఉద్యోగాలు,డిగ్రీతో ఉన్నవాళ్లతో పాటుగా సృజనాత్మకత లేదా కమ్యూనికేషన్‌పై ఆధారపడే ఉద్యోగులు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది.
































