దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీదారు అయినటువంటి టీవీఎస్ (Tvs) భారతీయుల కోసం రోజువారి అవసరాలకు ఉపయోగపడే టూవీలర్స్‌ను విక్రయించడంలో ఎప్పుడు కూడా ముందు ఉంటుంది.
ఈ కంపెనీకి సంబంధించిన సేల్స్ మెరుగ్గానే నమోదవుతున్నాయి. తన ప్రసిద్ధ మోడల్ స్టార్ సిటీ ప్లస్ (Star City Plus)కు సంబంధించి సేల్స్ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, జూన్ 2025లో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మరోసారి తన మార్కెట్లోని స్థానం ఎంత బలమైనదో నిరూపించుకుంది. ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ సెగ్మెంట్లో దీర్ఘకాలంగా ఉన్న ఈ బైక్, తన సదుపాయాలు, మైలేజ్, నమ్మకమైన పనితీరుతో వినియోగదారుల మనసు గెలుచుకుంటూనే ఉంది. జూన్ 2025లో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్‌లు ఏకంగా 2,400 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఇది పాత ఏడాది జూన్ 2024తో పోలిస్తే మంచి వృద్ధి. ఎందుకంటే గత సంవత్సరం ఇదే నెలలో కేవలం 471 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అంటే ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది సుమారుగా 409.55 శాతం వృద్ధి అని చెప్పుకోవచ్చు. దీని ప్రధాన కారణం టీవీఎస్ బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, బైక్ అధ్భుతమైన మైలేజ్, వినియోగదారుల వాడుకకు అనుగుణంగా అందుబాటులో ఉండే ఫీచర్లు.
ముఖ్యంగా, రోజువారీ ప్రయాణాలు చేసే వర్కింగ్ పీపుల్‌కు ఇది ఒక తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇచ్చే మోడల్జ Tvs Star City Plus డ్యూయల్ టోన్ డ్రమ్ వేరియంట్ ధర రూ.75,286, డ్యూయల్ టోన్ డిస్క్ వేరియంట్ ధర వచ్చేసి రూ.79,282. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ ధరలు. ఆన్‌రోడ్ వచ్చే సరికి డ్యూయల్ టోన్ డ్రమ్ వేరియంట్ ధర రూ.94,779, డిస్క్ వేరియంట్ రూ.99,335 వరకు ఉంటుంది.
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఇది ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవాలని కోరుకునే సాధారణ వినియోగదారులకి నిజమైన బహుమతి లాంటి బైక్. ఇది 109.7 సీసీ సామర్థ్యంతో కూడిన శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 6.03 కిలోవాట్లు (దాదాపు 8.2PS) శక్తిని, 8.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే, డైలీ రైడింగ్‌కు కావాల్సిన వేగం, తక్కువ పెట్రోల్‌లో ఎక్కువ ప్రయాణం.. రెండూ ఈ బైక్‌లో సమానంగా ఉంటాయి.
ఇది 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది, అంటే ఒకసారి ఫుల్ చేసినట్లయితే నగర ప్రయాణాలు, డైలీ ఆఫీసు కమ్యూట్స్ అన్నీ చాలాసేపు టెన్షన్ లేకుండా పూర్తి చేయొచ్చు. ముఖ్యంగా ఈ బైక్ మైలేజ్ కింగ్. మార్కెట్లో ఉన్న యూజర్ల ఫీడ్‌బ్యాక్ ప్రకారం, ఇది సుమారు 70 నుండి 85 కి.మీ/లీటర్ వరకూ మైలేజ్ ఇస్తోంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సమయంలో ఇది బెస్ట్..
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్లో సుదీర్ఘకాలంగా తన స్థానాన్ని నిలబెట్టుకున్న మోడల్. ప్రస్తుతం ఈ బైక్ రెండు వేరియంట్లలోడ్యూయల్ టోన్ డ్రమ్, డ్యూయల్ టోన్ డిస్క్ అందుబాటులో ఉంది. డ్యూయల్ టోన్ డ్రమ్ వేరియంట్ కొనుగోలుదారులకు నాలుగు రకాల ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లను అందిస్తోంది. వీటిలో నలుపు/నీలం, నలుపు/ఎరుపు, నలుపు/బూడిద, నీలం/సిల్వర్ ఉన్నాయి.
మరోవైపు, డ్యూయల్ టోన్ డిస్క్ వేరియంట్ మూడు రంగుల ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి నలుపు/ఎరుపు, నలుపు/బూడిద, నీలం/సిల్వర్ కలయికలు. ఈ కలర్ కాంబినేషన్లు మెట్రో యూజర్ల నుంచి రూరల్ యూజర్ల వరకు అందరినీ ఆకట్టుకునేలా డిజైన్ చేయబడ్డాయి. ఉద్యోగస్తులు, రోజువారి ప్రయాణాలకు మైలేజ్ పరంగా ఈ బైక్ బాగా సెట్ అవుతుంది.
































