PAN Card Fraud: పాన్ కార్డ్ హ్యాక్ అయినట్లు గుర్తించడం ఎలా?

ప్రస్తుత కాలంలో బ్యాంకు వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కొందరు సైబర్స్ కామర్లు ఎప్పుడు? ఏ రకంగా మోసం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఒకప్పుడు కాల్ చేసి ఓటీపీ నెంబర్ అడిగి.. బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బును దోచుకునేవారు.. ఆ తర్వాత కొన్ని యాప్ ల ద్వారా ఫోన్లో నుంచి విలువైన సమాచారం తెలుసుకొని డబ్బు మాయం చేసేవారు. కానీ ఇప్పుడు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. మనకు తెలియకుండానే మన పేరిట రుణాలు తీసుకొని ఈఎంఐ లు కట్టకుండా ఎగ్గొడుతున్నారు. నిజమైన కార్డు హోల్డర్ నష్టపోతున్నారు. సాధారణంగా లోన్ తీసుకోవడానికి పాన్ కార్డు అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పాన్ కార్డు కూడా స్కామ్ జరుగుతోంది. అదెలా ఉంటుందంటే?


బ్యాంకు వ్యవహారాల్లో పాన్ కార్డు ప్రధానంగా ఉంటుంది. పాన్ కార్డు తోనే అన్ని వ్యవహారాలు జరపాల్సి ఉంటుంది. బ్యాంకు నుంచి రుణం మంజూరు చేయాలంటే కూడా పాన్ కార్డు వివరాలు అడుగుతారు. అయితే కొన్ని బ్యాంకులో ఆన్లైన్లోనే రుణాలు మంజూరు చేస్తాయి. అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలు సైతం మినిమం వివరాలు అందిస్తే కావాల్సిన రుణాన్ని అందిస్తాయి. దీంతో కొందరు సైబర్ నేరగాళ్లు కొందరు వ్యక్తుల పాన్ కార్డులను దొంగిలించి వారికి తెలియకుండా వారి పేరు మీద రుణాలు తీసుకుంటున్నారు. అయితే లోన్ తీసుకున్నవారు ఈఎంఐ చెల్లించకపోవడంతో అసలు విషయం బయటపడుతుంది. అయితే ఎప్పటికప్పుడు తమ పాన్ కార్డు హ్యాక్ కు గురయిందా? లేదా? అనేది తెలుసుకుంటూ ఉండాలి.

అందుకోసం ముందుగా సిబిల్ స్కోర్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. సివిల్ స్కోర్ తగ్గినట్లు అనిపిస్తే వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించాలి. రెగ్యులర్గా బ్యాంకు ట్రాన్సాక్షన్ నడిపిస్తే సిబిల్ స్కోర్ తగ్గే అవకాశం ఉండదు. అలాగే ఈఎంఐ రెగ్యులర్ గా చెల్లిస్తే కూడా సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అయితే ఈ సిబిల్ స్కోర్ తగ్గినట్లు అనిపిస్తే పాన్ కార్డు చోరీకి గురైనట్లు గుర్తించుకోవాలి.

ఇక పాన్ కార్డు ఎవరైనా మిస్ యూస్ చేసినట్లు అనిపిస్తే.. వెంటనే బ్యాంక్ అధికారుల వద్దకు వెళ్లి సమాచారం తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి పాన్ కార్డు వివరాలు ఇతరుల వద్దకు వెళితే ఎప్పటికీ తమకు తెలియకుండానే డబ్బు ఉంటుంది. ఒకసారి పాన్ కార్డు ద్వారా డబ్బు చోరీకి గురైనట్లు తెలిస్తే.. వెంటనే ఆ పాన్ కార్డును డి ఆక్టివేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఆగి కేవైసీ ని అప్డేట్ చేసుకోవాలి.

పాన్ కార్డు హ్యాక్ కు గురికావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇందులో మొబైల్ కు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని మెసేజ్ వస్తుంటాయి. వీటిని ఓపెన్ చేయడం ద్వారా పాన్ కార్డు వివరాలను కూడా అడుగుతారు. ఈ వివరాలు అందించినప్పుడు వాటిని ఇతరులు హక్ చేస్తారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్లో కాకుండా.. బ్యాంకుకు నేరుగా వెళ్లి పాన్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.